Vijay–Trisha: త్రిష బర్త్ డే రోజు విజయ్‌ని విజయం వరిస్తుందా? నెట్టింట హాట్ టాపిక్ మారిన ఎలక్షన్ రిజల్ట్స్!

Vijay–Trisha: త్రిష బర్త్ డే రోజు విజయ్‌ని విజయం వరిస్తుందా? నెట్టింట హాట్ టాపిక్ మారిన ఎలక్షన్ రిజల్ట్స్!

‘కోయిన్సిడెన్స్’ (Coincidence).. కొన్ని సంఘటనలు ప్లాన్ చేయకుండానే ఒకే సమయంలో ఒకేలా జరిగిపోతుంటాయి. అయితే, ఇదే ‘కోయిన్సిడెన్స్’.. ఇపుడు రాజకీయాలు మరియు సినీ ప్రపంచాన్ని ఒకే వేదికపై నిలబెట్టింది. సాధారణంగా రాజకీయాలు, సినిమాలు రెండూ వేర్వేరు రంగాలు అయినప్పటికీ, ప్రజల దృష్టిలో ఇవి తరచూ కలిసిపోతుంటాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సినిమా ప్రభావం రాజకీయాలపై ఎంతగానో ఉంటుంది. సినిమాల్లో హీరోలకు లభించే అభిమానమే, రాజకీయాల్లో నాయకులకు ఓట్ల రూపంలో కనబడుతుంది. ఇపుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో కారణమైంది. ఆ వివరాల్లోకి వెళితే.. 

విజయ్ – తమిళనాడు ఎన్నికలు

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల కమిషన్ ప్రకారం, ఏప్రిల్ 23, 2026న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి ఎన్నికలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కారణం, తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

కీలక తేదీలు – పెరిగిన ఆసక్తి

ఇక మరోవైపు, కొన్ని కీలక తేదీలు వరుసగా రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల కేసు విచారణ ఏప్రిల్ 20న జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కేవలం మూడు రోజుల తర్వాతే పోలింగ్ (ఏప్రిల్ 23) జరగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.

త్రిష బర్త్‌డే – అసెంబ్లీ రిజల్ట్స్

ఇదిలా ఉండగా, తమిళనాడులో మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుండటం, అదే రోజు హీరోయిన్, విజయ్ రూమర్ గర్ల్ ఫ్రెండ్  త్రిష (Trisha Krishnan) పుట్టినరోజు కావడం మరో ఆసక్తికర అంశంగా మారింది. గత కొంతకాలంగా విజయ్-త్రిష పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ ‘కోయిన్సిడెన్స్’.. సినీ రాజకీయ వర్గాలతో పాటుగా నెటిజన్లలోనూ విపరీతమైన చర్చ మొదలైంది.

“విజయ్ రాజకీయ భవిష్యత్తు – త్రిష బర్త్‌డే రోజే నిర్ణయం” అంటూ నెటిజన్లు మీమ్స్, పోస్టులతో సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల ఉత్కంఠ, మరోవైపు విజయ్-త్రిషల అంశం కలవడంతో ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ALSO READ :  సల్మాన్ ఖాన్ 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' టైటిల్ మార్పు..

ముగింపు

మే 4న వెలువడే ఫలితాలు రాజకీయంగా ఎంత కీలకమో, అదే రోజు చోటుచేసుకుంటున్న ఈ ‘కోయిన్సిడెన్స్’ కూడా అంతే ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా, రాజకీయాలు కలిసిన ఈ పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. 

అయితే ఈ అంశాలపై ఇప్పటివరకు విజయ్ గానీ, త్రిష గానీ తమపై వస్తోన్న పుకార్లపై ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. విడాకుల కేసు, డేటింగ్‌కు సంబంధించిన ప్రచారాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై కూడా క్లారిటీ ఇవ్వలేదు.

అందువల్ల ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ వార్తలు ఎక్కువగా ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. అధికారిక ధృవీకరణ లేకపోవడంతో ఈ అంశాలను నిర్ధారిత నిజాలుగా అని చెప్పడం కష్టం.

అసలేం జరిగింది?

తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ వ్యక్తగత జీవితం ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు రాజకీయ విమర్శలతో సతమతమవుతుండగా.. మరోవైపు తన భార్య సంగీతతో విడాకుల వ్యవహారం, లేటెస్ట్ గా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఈ చర్చకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఈ వ్యవహారంలో స్టార్ హీరోయిన్ త్రిష పేరు తెరపైకి రావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

రూమర్స్ కి ఊతం:

విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన తరుణంలో, ఇటీవల జరిగిన ఒక రిసెప్షన్ వేడుకలో విజయ్, త్రిష కలిసి కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ కలిసి ఒకే కారులో రావడం, వేదికపై నూతన వధూవరులను విష్ చేయడం, ఫోటోలకు కలిసి పోజులివ్వడం వంటివి వైరల్ అయ్యాయి.

గతంలో వీరిద్దరూ కలిసి 'గిల్లీ', 'కురువి', 'లియో' వంటి హిట్ చిత్రాల్లో నటించారు. అయితే ఈ సాన్నిహిత్యం కాస్తా రిలేషన్‌షిప్‌గా మారిందంటూ పుకార్లు షురూ అయ్యాయి. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న కీలక సమయంలో ఈ వివాదం ఆయన ఇమేజ్‌కు ఇబ్బందిగా మారింది.