RGV: మళ్లీ ఫామ్ లోకి రామ్ గోపాల్ వర్మ.. 'సర్కార్ 4' అనౌన్స్‌తో సినీ ఇండస్ట్రీ షేక్!

RGV: మళ్లీ ఫామ్ లోకి రామ్ గోపాల్ వర్మ.. 'సర్కార్ 4' అనౌన్స్‌తో సినీ ఇండస్ట్రీ షేక్!

ఇండియన్ సినీ బాక్సాఫీస్ వద్ద గ్యాంగ్‌స్టర్ డ్రామాలు, పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( RGV ) . ఈ సంచలన డైరెక్టర్ ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వస్తున్నారు. తన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన 'సర్కార్' ఫ్రాంచైజీలో నాలుగో భాగాన్ని ప్రకటించి సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. ఇటీవల ముంబైలో జరిగిన 'రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్'లో ఆయన ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

 'సర్కార్ 4' షూటింగ్ రెడీ!

ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న వర్మ, అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. నేను 'సర్కార్ 4' చేస్తున్నాను. వచ్చే నెల నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది అని ప్రకటించారు. దీంతో పాటు 'ది సిండికేట్' అనే మరో ఆసక్తికర ప్రాజెక్టును కూడా పట్టాలెక్కిస్తున్నానని, అది తన గత సినిమాల 'పాపాలన్నింటినీ' కడిగేస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సారి అమితాబ్ ఉంటారా?

2005లో విడుదలైన మొదటి భాగం 'సర్కార్' భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అమితాబ్ బచ్చన్ పోషించిన సుభాష్ నాగ్రే పాత్ర, ఆ పాత్ర వెనుక ఉన్న పవర్ పాలిటిక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  అమితాబ్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో గ్రేడ్-ఏ పొలిటికల్ డ్రామాగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సర్కార్ రాజ్ (2008) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.  ఐశ్వర్య రాయ్ రాకతో ఈ సిరీస్ మరింత గ్లామర్‌ను, తీవ్రతను సంతరించుకుంది. 

ఇక దాదాపు పదేళ్ల తర్వాత వచ్చిన  సర్కార్ 3 (2017) భాగంలో యామీ గౌతమ్, మనోజ్ బాజ్‌పాయ్ వంటి నటులు మెరిశారు. ఇప్పుడు రాబోతున్న నాలుగో భాగంలో కూడా అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ చేస్తారా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. అయితే 'సర్కార్' అంటేనే అమితాబ్ కాబట్టి, ఆయన లేకుండా ఈ ప్రాజెక్టును ఊహించుకోవడం కష్టమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ALSO READ :  త్రిష బర్త్ డే రోజు విజయ్‌ని విజయం వరిస్తుందా?

కొత్త తరంపై ప్రశంసలు

ప్రస్తుత తరం దర్శకుల్లో ఆదిత్య ధర్ ('ఉరి' ఫేమ్) పనితీరుపై వర్మ ప్రశంసలు కురిపించారు. ఆయన రాబోతున్న ప్రాజెక్ట్ 'ధురంధర్ 2' అద్భుతంగా ఉండబోతుందని జోస్యం చెప్పారు. మొత్తానికి, ఆర్జీవీ మళ్ళీ తన సొంతసర్కార్ సిరీస్ వస్తుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాత వర్మ మార్కు పొలిటికల్ హీట్ మళ్ళీ కనిపిస్తుందని సినిమా ప్రేమికులు ఆశిస్తున్నారు. 'సర్కార్ 4' తో ఆర్జీవీ బాక్సాఫీస్ వద్ద తన పూర్వ వైభవాన్ని అందుకుంటారా అనేది వేచి చూడాలి!