పాపం ఈ యువ పైలట్.. ఇప్పుడు హాట్ టాపిక్.. ఈ శాంభవి పాఠక్ !

పాపం ఈ యువ పైలట్.. ఇప్పుడు హాట్ టాపిక్.. ఈ శాంభవి పాఠక్ !

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులలో లియర్‌జెట్ 45 పైలట్-ఇన్-కమాండ్ కెప్టెన్ శాంభవి పాఠక్ కూడా ఉన్నారు. శాంభవి ఎయిర్ ఫోర్స్ బాల భారతి స్కూల్‌లో చదువుకుంది. తరువాత ముంబై విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సి, ఏరోన్యూటిక్స్/ఏవియేషన్/ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో చేరింది.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో పైలట్-ఇన్-కమాండ్ కెప్టెన్ సుమిత్ కపూర్తో పాటు ఇద్దరు వ్యక్తుల సిబ్బందిలో శాంభవి కూడా ఉంది. ఢిల్లీకి చెందిన చార్టర్ సంస్థ VSR నడుపుతున్న విమానంలో అజిత్ పవార్ తన వ్యక్తిగత భద్రతా అధికారి విదిత్ జాదవ్, అటెండెంట్ పింకి మాలితో కలిసి ప్రయాణిస్తున్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు ఈ నలుగురూ కూడా విమాన ప్రమాదంలో చనిపోయారు.

ఈ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) రంగంలోకి దిగింది. విమాన ప్రమాదంపై AAIB బృందం దర్యాప్తు చేపట్టనుంది. ఘటనా స్థలాన్ని AAIB అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. విమాన అవశేషాలు, సాంకేతిక లోపాలపై AAIB ఫోకస్ చేసింది.