T20 World Cup 2026: మీరు వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే మేము ఆడతాం.. పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన పసికూన

T20 World Cup 2026: మీరు వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే మేము ఆడతాం.. పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన పసికూన

టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనడంపై పాకిస్తాన్ ఇంకా సందిగ్ధంలోనే ఉంది. టోర్నీలో పాల్గొనాలా వద్దా? అనే అంశంపై తుది నిర్ణయాన్ని ఈ శుక్రవారం లేదా వచ్చే సోమవారం వరకు తీసుకుంటామని పాక్ క్రికెట్‌‌‌‌‌‌‌‌ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోహ్‌‌‌‌‌‌‌‌సిన్ నఖ్వీ తెలిపాడు. భద్రతా కారణాల దృష్ట్యా ఇండియాలో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై ఐసీసీ బషిష్కరణ వేటు వేయడానికి నిరసనగా పాక్ టోర్నీ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనతో ఉంది.

ఈ క్రమంలో నఖ్వీ తాజాగా దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌‌‌‌‌‌‌‌తో భేటీ అయ్యాడు. ఐసీసీ వ్యవహారంపై అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ప్రధాని సూచించినట్లు నఖ్వీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఒకవేళ పాకిస్థాన్ తప్పుకుంటే ఆ స్థానంలో ఉగాండా వరల్డ్ కప్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పాకిస్థాన్ క్రికెట్ పై ఐస్లాండ్ క్రికెట్ సెటైర్ల వర్షం కురిపిస్తుంది. పాకిస్థాన్ జట్టును త్వరగా వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాలని..ఆ స్థానాన్ని తాము భర్తీ చేస్తామని ఐస్లాండ్ క్రికెట్ చమత్కారంగా ట్వీట్ చేసింది.

►ALSO READ | T20 World Cup warm-up schedule: వరల్డ్ కప్‌కు వార్మప్ షెడ్యూల్ రిలీజ్.. టీమిండియాకు ఒక్కటే మ్యాచ్

ఐస్లాండ్ క్రికెట్ తమ అధికారిక ఎక్స్ ద్వారా ఇలా రాసుకొచ్చింది. "టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై పాకిస్తాన్ త్వరగా నిర్ణయం తీసుకోవడం మాకు నిజంగా అవసరం. ఫిబ్రవరి 2న పాకిస్థాన్ బయలుదేరిన వెంటనే మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము". అని కొలంబోకు అందుబాటులో ఉన్న విమాన ఎంపికల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది. మొత్తానికి పాకిస్థాన్ క్రికెట్ ను ఐస్లాండ్ క్రికెట్ ట్రోల్స్ కురిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

ఇండియా మ్యాచ్ మాత్రమే బాయ్ కాట్:
 
పాక్ ప్రభుత్వం, పీసీబీ రెండు ప్రధాన అంశాలపై ఆలోచిస్తున్నాయి.అసలు వరల్డ్ కప్ నుండే పూర్తిగా తప్పుకోవాలని లేదంటే  ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఇండియాతో జరిగే  హై -ప్రొఫైల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను బహిష్కరించాలని భావిస్తోంది. మరోవైపు వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పుకుంటే మాత్రం పాక్‌‌‌‌‌‌‌‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోనుంది. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో ఆ జట్టుపై వేటు వేయడంతో పాటు పీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌లో ఫారిన్ ప్లేయర్లకు అనుమతి ఇవ్వకూడదని  భావిస్తోంది.