మొయినాబాద్ లో స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

మొయినాబాద్ లో స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

హైదారాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. మొయినాబాద్ మృగవాణి పార్క్ దగ్గర  ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తాపడింది. బస్సులోని పలువురు విద్యార్థులకు  తీవ్ర గాయాలయ్యాయి.  

బండ్లగూడ జాగీర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు హైదరాబాద్ నుంచి మొయినాబాద్ వెళ్తుండగా  మృగవాణి పార్కు  దగ్గరకు  చేరుకోగానే ముందున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు బోల్తాపడింది 

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు,స్థానికులు  గాయపడ్డ విద్యార్థులను అంబులెన్స్ లో  వెంటనే  షాదన్ ఆస్పత్రికి తరలించారు . ప్రమాదం కారణంగా హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  బోల్తా పడ్డ వాహనాన్ని జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు పోలీసులు. బస్సు ప్రమాద ఘటనతో ఆస్పత్రికి చేరుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడా లేదా..బస్సు ఫిట్నెస్ పై అని ఆరాదీస్తున్నారు.