బారామతి: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ CM అజిత్ పవార్ (66) దుర్మరణం చెందారు. ఆయనతో పాటు ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురు చనిపోయినట్లు డీజీసీఏ ప్రకటించింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ చార్టర్డ్ ఫ్లైట్లో అజిత్ పవార్తో పాటు ఆరు మంది ప్రయాణిస్తున్నారు.
Ajit Pawar, NCP chief and Maharashtra's Deputy Chief Minister, died in a tragic plane crash this morning while he was flying from Mumbai to Baramati
— Sumit (@SumitHansd) January 28, 2026
Four others, possibly including pilots and Pawar's security personnel, have also died
RIP🙏#AjitPawar | #PlaneCrash | #Baramati pic.twitter.com/Jf0PwSOvj6
బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ దుర్మరణం పాలవడంతో మహారాష్ట్రతో పాటు దేశం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాంకేతిక సమస్య కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఈ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
