వర్షం పడగానే పకోడీలు తినాలనిపిస్తోందా ? ఇది నిజమైన ఆకలి కాకపోవచ్చు.. ఎలా తెలుసుకోవాలి ?

వర్షం పడగానే పకోడీలు తినాలనిపిస్తోందా ? ఇది నిజమైన ఆకలి కాకపోవచ్చు.. ఎలా తెలుసుకోవాలి ?

వర్షం పడుతుందంటే  చాలు... వేడివేడి పకోడీలు, సమోసాలు తినాలనిపిస్తుందా?  "అబ్బా.. కడుపులో భలే ఆకలిగా ఉందే" అనుకుంటున్నారా? అయితే ఆగండి! అది నిజమైన ఆకలి కాకపోవచ్చు, కేవలం వర్షాకాలం మీ మెదడుతో ఆడుతున్న ఒక చిన్న డ్రామా కావచ్చు.

పోషకాహార నిపుణులైన డాక్టర్  ప్రకారం... మనకు వేసేది నిజమైన ఆకలి ఆహ్ ? లేక వర్షపు వాతావరణం తెచ్చిన కోరికన ? దీనిని తెలుసుకోవడానికి కొన్ని సింపుల్ సంకేతాలు ఉన్నాయి:

1. ఇప్పుడే తిన్నా.. మళ్లీ తినాలనిపిస్తోందా?
నిజమైన ఆకలి అనేది నెమ్మదిగా మొదలవుతుంది. కానీ వాతావరణం వల్ల వచ్చే కోరిక హఠాత్తుగా ఊడిపడుతుంది. మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేసిన 40 నిమిషాలకే బయట వర్షం పడటం చూసి, ఏదైనా వేడిగా తింటే బాగుండు అనిపిస్తే... అది ఆకలి కాదు, జస్ట్ ఒక థాట్ అంతే.

2. 'ఆ ఫుడ్' తప్ప ఇంకేదీ వద్దు అనుకుంటున్నారా?
మీకు నిజంగా ఆకలిగా ఉంటే ఒక ఆపిల్ ఇచ్చినా, దోసకాయ ఇచ్చినా, చివరికి అన్నం పప్పు ఇచ్చినా తినేస్తారు. కానీ నాకు పకోడీలే కావాలి లేదా సమోసానే తింటా అని ఒకే ఒక్క ఫుడ్ పై  పట్టుపడితే... అది పొట్ట అడుగుతున్న ఆకలి కాదు, నాలుక అడుగుతున్న రుచి.

3. మైండ్ డైవర్ట్ చేస్తే మాయమైపోతుందా?
మీకు పకోడీలు తినాలనిపించగానే ఓ 15 నిమిషాలు వేరే పనిలో మునిగిపోండి. ఏదైనా ఫోన్ మాట్లాడటం లేదా ఒక చిన్న పని చూసుకోవడం చేయండి. ఆ తర్వాత కూడా ఆ కోరిక అలాగే ఉంటే ఓకే, కానీ మైండ్ డైవర్ట్ అయ్యాక ఆ ఆలోచనే మర్చిపోతే... అది వర్షం తెచ్చిన తాత్కాలిక మోజు మాత్రమే!

4. మబ్బు వేస్తే మనసు ఓదార్పు వెతుకుతుంది
వర్షం పడేటప్పుడు చీకటిగా, చల్లగా ఉండే వాతావరణం మన మూడ్‌ను మారుస్తుంది. మన మెదడు అకస్మాత్తుగా ఏదైనా క్రంచీగా, కారంగా తిని రిలాక్స్ అవ్వాలని చూస్తుంది. అందుకే మబ్బు వేయగానే పకోడీలు గుర్తొస్తాయి. ఇలాంటప్పుడు వేడి నీళ్లు తాగడం, లైట్లు వెలిగించి వెలుతురు తెచ్చుకోవడం లేదా కాసేపు అటుఇటు నడవటం చేస్తే ఆ కోరిక తగ్గిపోతుంది.

అయితే పకోడీలు తినడం బంద్ చేయాలా?
ఎం అవసరం లేదు.. ప్రతి కోరికతో యుద్ధం చేయాల్సిన పనిలేదు. కాకపోతే, మీ శరీరం నిజమైన ఆకలితో అడుగుతోందా ? లేక వర్షం చూసి మూడ్ వచ్చి అడుగుతోందా ? అనేది గమనించడం ముఖ్యం. ఇది తెలుసుకుంటే, ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అన్నట్లు... ఒక్కోసారి తెలివిగల నిర్ణయం 'ఒక ప్లేట్ పకోడీ తినడమే' కావచ్చు!