ఇంట్లో అక్రమంగా కోట్ల రూపాయల నోట్ల కట్టలతో బయటపడిన జడ్జి కేసులో లోక్ సభ ప్యానెల్ నివేదికను లోక్ సభ ముందు ప్రవేశపెట్టింది. 2026 ఆగస్టు 12న నివేదిక ప్రకారం.. అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను దోషిగా తేల్చింది. విచారణ సందర్భంగా తన ఇంట్లో బయటపడిన నోట్ల కట్టలకు సంబంధించి సరైన ఆధారాలు చూపలేకపోయారని కమిటీ పేర్కొంది.
జస్టిస్ వర్మపై మూడు అభియోగాలను పరిశీలించింది ప్యానెల్. అందులో ఒకటి దొరికిన డబ్బుకు ఆధారాలు చూపలేకపోవడం. ఢిల్లీలోని 30 తుగ్లక్ క్రెసెంట్ లో ఉన్ తన నివాసలంలోని స్టోర్ రూమ్ లో కట్టలు కట్టలు దొరికిన 500 నోట్లకు ఆధారాలు చూపడంలో విఫలమయ్యారని కమిటీ పేర్కొంది.
రెండో అభియోగం సాక్ష్యాలను మాయం చేయడం. స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగిన ఘటనలో.. స్టోర్‌రూమ్‌ను వెంటనే సీల్ చేయలేదని, సాక్ష్యాలను మాయం చేశారని కమిటీ తేల్చింది. అక్కడ బయటపడిన కరెన్సీ కనబడకుండా పోయినట్లు పేర్కొన్నారు.
మూడో అభియోగం దాటవేసే వివరణలు. ఘటనపై జస్టిస్ వర్మ ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని.. దాటవేసే ధోరణిలో ఆయన సమాధానం చెప్పినట్లు కమిటీ పేర్కొంది. ఫైర్ యాక్సిడెంట్ తర్వాత ఆ డబ్బు ఎవరిది అనే విషయంలో సంబంధంలేని సమాధానాలు చెప్పినట్లు తెలిపింది.
అయితే జడ్జి ఇంట్లో లభ్యమైన డబ్బు ఎంత అనేది కచ్చితంగా చెప్పలేమని కమిటీ తెలిపింది. ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత డబ్బును వెంటనే సీజ్ చేయలేదని.. బయటపడిన డబ్బును దాచలేదని నివేదికలో పేర్కొంది.
ఘటన జరిగిన స్టోర్ రూమ్ జస్టిస్ వర్మ నియంత్రణలో లేదని వచ్చిన ఆరోపణలను కమిటీ కొట్టివేసింది. స్టోర్ రూమ్ వర్మ నివాసంలోనే ఉందని.. వర్మ కుటుంబం కంట్రోల్ లోనే స్టోర్ రూమ్ ఉన్నట్లు కమిటీ తేల్చింది.
ALSO READ : ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా..?
2025 మార్చి 14న జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన నివాసంలో అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ ఇనుప బీరువాల్లో, రహస్య రూముల్లో గుట్టలు గుట్టలుగా నగదు కనిపించింది. ఓ జడ్జిల ఇంట్లో అంత మొత్తంలో నగదు దొరకడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది.
