ఎల్బీనగర్ కానిస్టేబుల్ సూసైడ్ అప్డేట్.. మీడియాకు వివరాలు వెల్లడించిన డీసీపీ

ఎల్బీనగర్ కానిస్టేబుల్ సూసైడ్ అప్డేట్.. మీడియాకు వివరాలు వెల్లడించిన డీసీపీ

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ బరాక్ లో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుని చనిపోయిన ఘటన సంచలనంగా మారింది. కానిస్టేబుల్ మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్న క్రమంలో.. ఘటనకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్ డీసీపీ అనురాధ వెల్లడించారు. 

డీసీపీ చెప్పిన వివరాల ప్రకారం..2026 ఆగస్టు 12న తెల్లవారుజామున 2 గంటల 20 నిమిషాలకు ఏసీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న సాయికుమార్ అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. డీసీపీ  ఆఫీస్ నుంచి డీఎస్ఆర్ కోసం సాయికుమార్ కు కాల్ చేస్తే స్పందించకపోవడంతో ఎల్బీనగర్ పీఎస్ కు కాల్ చేయడం జరిగింది.

ఒక కానిస్టేబుల్ ఏసీపీ ఆఫీస్ కు వెళ్లి చూడగా బ్యారక్ లో సాయికుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉండటం గమనించాడు. ఏమైనా ఛాన్స్ ఉంటుందేమోనని వెంటనే కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ డాక్టర్స్ పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారని డీసీపీ తెలిపారు. 

దీంతో వెంటనే సాయికుమార్ ఫ్యామిలీకి సమాచారం అందించి పోస్ట్ మార్టం కోసం ఉస్మానియాకు తరలించామని డీసీపీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సాయికుమార్ కు రావాల్సిన బెనిఫిట్స్  ఆయన కుటుంభ సభ్యులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాట్లు తెలిపారు.