చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి మాత దేవాలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించిన దొంగ గర్భ గుడిలోకి వెళ్లి లోపల ఉన్న హుండీ ఎత్తుకెళ్లిపోయాడు. ఆలయ ప్రాంగణంలో హుండీ ధ్వంసం చేసి అందులో ఉన్న డబ్బులు తీసుకెళ్లిపోయాడు. ఈ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అవడంతో.. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగ ఆచూకీ దొరకబట్టే పనిలో ఉన్నారు. మెదక్ జిల్లాలోనే మరో ఆలయంలో కూడా చోరీ జరిగింది.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు శ్రీ గురు పీఠంలో దత్తాత్రేయ స్వామి, సాయిబాబా.. ఈ రెండు ఆలయాలలోని హుండీలను దొంగలు చోరీ చేశారు. తాళాలు పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లి హుండీలో ఉన్న డబ్బులు తీసుకొని శివారులో హుండీలు పడేసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీస్ స్టేషన్కు జస్ట్ కిలోమీటర్ దూరంలోనే సాయిబాబా, దత్తాత్రేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. గత పది రోజుల్లో రెండు సార్లు చోరీ జరగడం గమనార్హం.
►ALSO READ | అమ్మ లేదని.. అమ్మేశారు.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో ఘటన
