సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రేమించి సహజీవనం చేస్తున్న వ్యక్తి తనను వదిలేశాడని ఓ ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగారెడ్డిపల్లి కాలనీలో జరిగింది. వన్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా జాల్ పల్లి గ్రామానికి చెందిన జేర్పాటు శివ అలియాస్ సునంద(25) నాలుగు సంవత్సరాల కింద ట్రాన్స్ జెండర్ గా మారి, సిద్దిపేటలోని లింగారెడ్డిపల్లి కాలనీకి వచ్చి బిక్షాటన చేస్తుంది.
సిద్దిపేటకు చెందిన బత్తుల అజయ్ కుమార్ తో పరిచయం పెంచుకొని, రెండున్నర సంవత్సరాల కింద ఇద్దరు పెండ్లి చేసుకున్నారు. ఇటీవల వారి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా ఈనెల 21 నుంచి ఇద్దరు విడిగాఉంటున్నారు. కాగా, అజయ్ తో విడిపోవడాన్ని తట్టుకోలేని సునంద తాను నివాసం ఉంటున్న రూమ్ లోనే ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని చనిపోయింది. మృతురాలి అన్న జేరుపాటి మల్లేశ్ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
