ఎర్రవల్లిలో ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి .. మూడు రోజులు.. రెండు సర్వే టీమ్ లు

ఎర్రవల్లిలో ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి .. మూడు రోజులు.. రెండు సర్వే టీమ్ లు

ములుగు/కొండపాక, వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్  మండలం ఎర్రవల్లిలోని 325 సర్వే నంబర్ లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎంజాయ్​మెంట్  సర్వే గురువారం తో పూర్తయింది. చివరి రోజైన గురువారం రెండు సర్వే టీమ్​లు 3.10 ఎకరాల్లో సర్వే చేశారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ సర్వే నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఇదిలాఉంటే గురువారం ఉదయం బీఆర్ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  ఎర్రవల్లి ఫామ్ హౌజ్ కు చేరుకొని కేసీఆర్ తో సమావేశమయ్యారు. అలాగే కొండపాక మండలం వెలికట్ట గ్రామపంచాయతీ పరిధిలోని 271 సర్వే నంబర్ లో గురువారం రెండో రోజు అధికారులు సర్వే నిర్వహించారు. 327. 09 ఎకరాల ప్రభుత్వ భూమిని గజ్వేల్  డివిజన్  రెవెన్యూ ఇన్స్​పెక్టర్  వంశీ ఆధ్వర్యంలో సర్వే చేసి హద్దులు నిర్దారించారు. ఈ సర్వే నంబర్ లోని 329 మంది రైతులకు నోటీసులు అందజేసి సర్వే చేపట్టారు. శుక్రవారం సర్వే పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.