హైదరాబాద్ సిటీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బైకు చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ జిల్లాపోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి 44 బైకులను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన బైకులను నంబర్ ప్లేట్ లు మార్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..
ఆదిలాబాద్ జిల్లా లో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో బైకులు చోరీ చేసి విక్రయిస్తున్న ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ముఠాలోని ఐదుగురు దొంగలను అరెస్ట్ చేశారు.నిందితులనుంచి 44 బైకులను స్వాధీనం చేసుకున్నారు. దొంగల విక్రయించిన బైకులను కొనుగోలు చేసిన ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగిలించిన బైకుల నంబర్ ప్లేట్ మార్చి దర్జాగా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చోరీ చేసిన బైకులను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.
