భారత్‌తో తొలి టెస్ట్‌కు శ్రీలంక జట్టు ప్రకటన.. డిక్వెల్లా రీఎంట్రీ, ముగ్గురు కొత్తవాళ్లకి ఛాన్స్!

భారత్‌తో తొలి టెస్ట్‌కు శ్రీలంక జట్టు ప్రకటన.. డిక్వెల్లా రీఎంట్రీ, ముగ్గురు కొత్తవాళ్లకి ఛాన్స్!

Sri Lanka Test Squad: ఆగస్టు 15 (శనివారం) నుంచి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్‌తో జరగబోయే తొలి టెస్టు కోసం శ్రీలంక క్రికెట్ (Srilanka) 16 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) రేసులో టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. ఆల్‌రౌండర్ ధనంజయ డి సిల్వా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కమిందు మెండిస్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపడతారు.

డిక్వెల్లా రీఎంట్రీ: 
శ్రీలంక జట్టుకు తొలి టెస్టుకు ముందే ఇద్దరు స్టార్ బ్యాటర్లు దూరమయ్యారు. తొడ కండరాల గాయంతో కుశాల్ మెండిస్, మణికట్టు శస్త్రచికిత్స కారణంగా పతుమ్ నిస్సంక ఈ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయారు. కుశాల్ మెండిస్ అందుబాటులో లేకపోవడంతో వికెట్ కీపింగ్ బాధ్యతల కోసం 33 ఏళ్ల సీనియర్ ప్లేయర్ నిరోషన్ డిక్వెల్లాను సెలెక్టర్లు మళ్లీ తుది జట్టులోకి తీసుకున్నారు. డిక్వెల్లా చివరిగా 2023లో శ్రీలంక తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు.

ముగ్గురు కొత్త ప్లేయర్లకు ఛాన్స్: 
ఈ సిరీస్ ద్వారా ముగ్గురు కొత్త కుర్రాళ్లు తొలిసారి శ్రీలంక టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు. 25 ఏళ్ల ఈ ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ కేశర నువంత ఇటీవల భారత్‌తో జరిగిన 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో 3 వికెట్లు, అంతకుముందు ఇండియా 'ఎ' పై 5 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అలాగే యంగ్ బ్యాటర్లు పసిందు సూరియబండార, సోనాల్ దినూషలు కూడా తొలిసారి జాతీయ జట్టులో ఆడేందుకు పిలుపు అందుకున్నారు.

ALSO READ : కేకేఆర్ నుంచి రింకూ సింగ్ ఔట్?

శ్రీలంక టెస్టు జట్టు: 
ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్ ), నిరోషన్ డిక్వెల్లా, నిషాన్ మదుష్క, లహిరు ఉదార, దినేష్ చండిమాల్, పసిందు సూరియబండార, సోనాల్ దినూష, రమేష్ మెండిస్, ప్రభాత్ జయసూర్య, కేశర నువంత, మిలాన్ రత్నాయకే, అసిత్ ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షాన్ మధుషంక