మన దేశంలో బడ్జెట్ ధరకు మంచి కారు కొనడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ముఖ్యంగా రూ. 8 లక్షల బడ్జెట్‌లో మంచి మైలేజ్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, లేటెస్ట్ ఫీచర్లు ఉండే ఎన్నో ఆప్షన్ల కార్లు ఉన్నాయి. కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లతో కార్లను మార్కెట్‌లోకి తెస్తుండటంతో, మన అవసరాలకు తగ్గ కార్ సెలెక్ట్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
మీరు ఫస్ట్ టైం కారు కొంటున్నా, చిన్న ఫ్యామిలీ కోసం కార్ కొనాలని చూస్తున్నా లేక ఆఫీసు వెళ్లేందుకు మంచి మైలేజ్ కారు కావాలనుకున్నా... ఈ ధరలో అటు బడ్జెట్, ఇటు కంఫర్ట్ రెండూ సరిగ్గా సరిపోతాయి.
ఇప్పుడు రూ. 8 లక్షల లోపు వచ్చే కార్లలో టచ్‌స్క్రీన్ డిస్ ప్లే, ఎయిర్‌బ్యాగ్‌లు, స్మార్ట్ కనెక్టివిటీ, మంచి మైలేజ్, సేఫ్టీ ఫీచర్లు ప్రామాణికంగా వస్తున్నాయి. చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి కాంపాక్ట్ SUVలు, స్టైలిష్ సెడాన్ల వరకు ప్రతి ఒక్కరి టెస్ట్ తగ్గట్టుగా కార్లు మార్కెట్లో ఉన్నాయి.
2026లో మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ డబ్బుకు పూర్తి వాల్యూ ఇచ్చే టాప్ 10 కార్ల వివరాలు ఇవే:
1. మారుతి సుజుకి స్విఫ్ట్
*స్టైలిష్ లుక్: యూత్ సహా అందరిని ఆకట్టుకునే మోడర్న్ డిజైన్.
*సూపర్ మైలేజ్: తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.
*సౌకర్యవంతమైన క్యాబిన్ : కూర్చోవడానికి మంచి స్పేస్ ఉంటుంది.
*తక్కువ మెయింటెనెన్స్: రిపేర్, సర్వీసింగ్ ఖర్చులు చాలా తక్కువ.
*సేఫ్టీ ఫీచర్లు: ప్రయాణికుల సేఫ్టీ కోసం అవసరమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
దీని ధర రూ.6.98 లక్షల నుండి
2. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
*ప్రీమియం ఇంటీరియర్: లోపల చూసేందుకు చాలా రిచ్‌గా, క్వాలిటీగా ఉంటుంది.
*ఈజీ ఇన్ఫోటైన్‌మెంట్: వాడటానికి చాలా ఈజీ టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఇచ్చారు.
*కంఫర్ట్ సీటింగ్: దూర ప్రయాణాల్లో సీట్లు అలసట అనిపించదు.
*స్మూత్ ఇంజిన్: కార్ నడిపేటప్పుడు ఇంజిన్ చాలా సైలెంట్‌గా, స్మూత్‌గా పనిచేస్తుంది.
* సిటీ డ్రైవింగ్: సిటీ నగరాల్లోని ట్రాఫిక్‌లోనూ ఈజీగా డ్రైవ్ చేయవచ్చు.
దీని ధర రూ.6.88 లక్షల నుండి
3. టాటా పంచ్
*మిని SUV లుక్: చిన్న కారైనా పెద్ద SUV లాంటి గంభీరమైన డిజైన్ ఉంటుంది.
*సూపర్ సేఫ్టీ: గట్టి నిర్మాణం, టాప్ లెవెల్ సేఫ్టీ రేటింగ్ పొందింది.
*మంచి స్పేస్: కార్ లోపల కూర్చోవడానికి సరిపోయే స్థలం ఉంటుంది.
*స్మూత్ రైడింగ్: గుంతల రోడ్లపై కూడా హాయిగా ప్రయాణించవచ్చు.
*ఆల్ రౌండర్: సిటీ ప్రయాణాలకే కాకుండా హైవేలకు కూడా పర్ఫెక్ట్ కార్.
దీని ధర రూ. 6.90 లక్షల నుండి
4. మారుతి సుజుకి బాలెనో
*విశాలమైన స్థలం: కార్ లోపల లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ చాలా విశాలంగా ఉంటాయి.
*లేటెస్ట్ టెక్నాలజీ: లేటెస్ట్ టచ్‌స్క్రీన్, ఫీచర్లు ఉన్నాయి.
*బెస్ట్ సేవింగ్స్ : మైలేజ్ విషయంలో చాలా బెస్ట్.
*రైడ్ కంఫర్ట్: ఈ కారులో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
*ప్రీమియం ఫీచర్లు: ఎక్కువ బడ్జెట్ కార్లలో ఉండే ఫీచర్లు ఇందులో చూడొచ్చు.
దీని ధర రూ.7.16 లక్షల నుండి
5. టాటా టియాగో
*స్ట్రాంగ్ సేఫ్టీ: బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ ఫీచర్లు చాలా బాగుంటాయి.
*ట్రెండీ డిజైన్: చూసేందుకు చాలా స్టైలిష్‌గా ఉంటుంది.
*మంచి కంఫర్ట్: లోపల సీట్లు జర్నీకి సౌకర్యంగా ఉంటాయి.
*తక్కువ ఖర్చు: కారు ధరతో పాటు మెయింటెనెన్స్ కూడా బడ్జెట్‌లోనే ఉంటుంది.
దీని ధర రూ. 5.66 లక్షల నుండి
6. హ్యుందాయ్ ఎక్స్టర్
*SUV స్టైలింగ్: మోడర్న్ డిజైన్‌తో చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది.
*స్మార్ట్ టెక్: కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఫీచర్లు ఉంటాయి.
*పక్కా సేఫ్టీ: ప్రయాణికుల సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
*విశాలమైన ఇంటీరియర్: క్యాబిన్ చాలా స్పేషియస్‌గా, ఆధునికంగా ఉంటుంది.
దీని ధర రూ.7.13 లక్షల నుండి
7. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
*ఎక్కువ స్పేస్: టాల్-బాయ్ డిజైన్ వల్ల లోపల ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది.
*అద్భుతమైన మైలేజ్: ఇంధన సేవింగ్స్ లో దీనికి తిరుగులేదు.
*పోకెట్ ఫ్రెండ్లీ: మెయింటెనెన్స్ ఖర్చులు చాలా తక్కువ.
*ఫ్యామిలీ కార్: చిన్న ఫ్యామిలీకి ప్రతిరోజు వాడకానికి పర్ఫెక్ట్ ఛాయిస్.
దీని ధర రూ. 5.95 లక్షల నుండి
8. రెనాల్ట్ కైగర్
*స్మార్ట్ SUV: తక్కువ ధరలో మంచి SUV లుక్ ఇస్తుంది.
*ప్రాక్టికల్ డిజైన్: కార్ లోపల లగేజ్ పెట్టుకోవడానికి, కూర్చోవడానికి మంచి స్థలం ఉంది.
*లేటెస్ట్ ఫీచర్లు: లేటెస్ట్ కార్లలో ఉండే మంచి టెక్ ఫీచర్లు ఉంటాయి.
*రోడ్ ప్రెజెన్స్: రోడ్డుపై వెళ్తుంటే మంచి రాయల్ లుక్ కనిపిస్తుంది.
దీని ధర రూ. 6.97 లక్షల నుండి
9. నిస్సాన్ మాగ్నైట్
*బోల్డ్ డిజైన్: బయట నుంచి చూస్తే చాలా పెద్ద కారులా ఆకట్టుకుంటుంది.
*లార్జ్ క్యాబిన్: లోపల కూర్చోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది.
*ఎక్కువ ఫీచర్లు: ఈ ధరలో లభించే ఫీచర్ల లిస్ట్ లో చాలా పెద్దది.
*బెస్ట్ ప్రైసింగ్: తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు ఉన్న కారు.
దీని ధర రూ.7.06 లక్షల నుండి
10. మారుతి సుజుకి డిజైర్
*క్లాసీ సెడాన్: స్టైలిష్‌గా ఉండే ప్రీమియం సెడాన్ డిజైన్.
*గ్రేట్ మైలేజ్: సెడాన్ మోడల్ అయినా మైలేజ్ చాలా బాగుంటుంది.
*కార్నర్ కంఫర్ట్: వెనుక సీట్లలో ప్రయాణించే వారికి బెస్ట్ కంఫర్ట్ ఉంటుంది.
*నమ్మకమైన పర్ఫార్మెన్స్: ఎక్కువ కాలం పాటు రీసేల్ వాల్యూ, నమ్మకాన్ని ఇచ్చే కారు.
దీని ధర రూ.7.55 లక్షల నుండి
గమనిక: ఈ ఎక్స్ షోరూం ధరలు అన్ని ప్రతి నగరాన్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి, పన్నులు బట్టి మారుతుంటాయి. మరింత పూర్తి సమాచారం కోసం మీ దగ్గరలోని డీలర్లను లేదా షోరూమ్ లో సంప్రదించవచ్చు.
