పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ..రూ.18కోట్ల బంగారం దోచుకెళ్లిన పనిమనుషులు  

పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ..రూ.18కోట్ల బంగారం దోచుకెళ్లిన పనిమనుషులు  

పనిచేస్తున్న ఇంటికే కన్నం వేశారు కేటుగాళ్లు..నమ్మి ఇంటిని అప్పజెప్పితే  తిరిగొచ్చేసరి గుల్ల చేశారు. యజమాని బయటికెళ్లిందే అదనుగా ఇంట్లో చొరబడి చోరీ చేశారు. కోట్ల విలువైన బంగారు నగలు దోచుకొని పరారయ్యారు. బెంగళూరులో ఓ బిల్డర్​ ఇంట్లో పనిమనుషులే రూ. 18కోట్ల విలువైన బంగారం ఆభరణాలతో పరారయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో పనిమనుషులు చేసిన అతిపెద్ద దోపిడీ ఇది.

బెంగళూరులోని యెమలూరు కెంపాపుర నివాసి, బిల్డర్​ షిమంత్​ అర్జున్ ఇంట్లో ఆదివారం చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు రూ.17.74 కోట్ల విలువైన బంగారం , వజ్రాలు, వెండి నగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. షిమంత్​ ఇంట్లోపనిచేస్తున్న నేపాలీ జంట ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఎలా దోచుకున్నారంటే.. 

ఇంటి యజమాని షిమంత్​ తన భార్య పిల్లలతో ఓ భూమి పూజ కార్యక్రామానికి వెళ్లగా అదే అదనుగా  ఇంట్లో పనిమనుషులుగా ఉన్న నేపాలి జంట  దినేష్​, కమలా మరో నేపాలితో కలిసి చోరీకి పాల్పడ్డారు. షిమంత్​ కుటుంబం బయటికి వెళ్లినప్పుడు మొదటి అంతస్తులోని బెడ్​ రూంలో చొరబడి లాకర్ పగలగొట్టి 1.5 కిలోల బంగారం, దాదాపు 5 కిలోల వెండి ఆభరణాలు, రూ.11.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారని పోలీసులు గుర్తించారు. 

►ALSO READ | బారామతి విమాన ప్రమాదం..అజిత్ పవార్ రెండేళ్ల క్రితం చేసినట్వీట్ వైరల్ 

నిందితులు ఇద్దరు 20 రోజుల ముందు హౌస్ కీపింగ్​ పనిలో చేరారని పోలీసులు తెలిపారు. పనిచేస్తూనే ఇంటి యజమాని కుటుంబ సభ్యులకదలికలను గమనించి దోపిడీకి ప్లాన్​ చేశారని పోలీసుల అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ కెమెరాల పరిశీలించి నిందితులకోసం గాలిస్తున్నారు. యజమానుల ఇంట్లో పనిమనుషులు చేసిన అతిపెద్ద దొంగతనాల్లో ఇదే పెద్దదని పోలీసులు అంటున్నారు.