మహారాష్ట్రలోని బారామతి విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చనిపోయిన తర్వాత వస్తున్న వార్తలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ ఘటన తర్వాత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రెండేళ్ల క్రితం విమానం ల్యాండింగ్ పై చేసిన ఓ ట్వీట్ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2024లో చేసిన ఆ ట్వీట్ లో .. మన ప్రయాణిస్తున్న విమానం, లేదా హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయితే పైలట్ ఒక మహిళ అని అర్థం చేసుకోవచ్చు. అంటూ వ్యంగ్యంగా రాశారు పవార్. మహిళా పైలట్ల నైపుణ్యాన్ని ప్రశంసించే ఉద్దేశంతో చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇప్పుడు బారామతి విమాన ప్రమాదం తర్వాత మరోసారి అదే ట్వీట్ నెటిజన్లు తిరిగి షేర్చేశారు. కాలానుగుణంగా ఈ ట్వీట్ మరో అర్థాన్ని ఇవ్వడంతో సోషల్ మీడియాలో చాలా స్పందన వచ్చింది. కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా మరికొందరు అప్పటి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నెట్టింట పెద్ద చర్చ పెట్టారు. ఇంకొందరు అజిత్ పవార్‌కు సంతాపం తెలుపుతూ పోస్టులు పెట్టారు.
