T20 World Cup warm-up schedule: వరల్డ్ కప్‌కు వార్మప్ షెడ్యూల్ రిలీజ్.. టీమిండియాకు ఒక్కటే మ్యాచ్

T20 World Cup warm-up schedule: వరల్డ్ కప్‌కు వార్మప్ షెడ్యూల్ రిలీజ్.. టీమిండియాకు ఒక్కటే మ్యాచ్

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 వార్మప్ మ్యాచ్ ల షెడ్యూల్ వచ్చేసింది. ఈ మెగా టోర్నీ కోసం ప్రాక్టీస్ మ్యాచ్ ల షెడ్యూల్ ను బుధవారం (జనవరి 28) ప్రకటించింది. ఫిబ్రవరి 2 మరియు ఫిబ్రవరి 6 వరకు వార్మప్ మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తం 5 రోజుల పాటు 15 మ్యాచ్ ల షెడ్యూల్ ను ఏర్పాటు చేశారు. ఇండియా ఫిబ్రవరి 4 న సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఇండియా వరల్డ్ కప్ లో ఆడబోయే లీగ్ మ్యాచ్ కు మూడు రోజుల ముందు డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. 

వార్మప్ లో భాగంగా తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి. ఇండియా సౌతాఫ్రికాతో పాటు అమెరికా, నమీబియాలతో వార్మప్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అయితే ఈ రెండు మ్యాచ్ లకు టీమిండియా సీనియర్ జట్టు ఇండియా 'ఏ' జట్టు ఆడనుంది. యూఎస్ఏ, నమీబియాతో తలపడే 'భారత 'ఏ' జట్టును బీసీసీఐ త్వరలో ఎంపిక చేస్తుంది. ఇండియా ఎ ఫిబ్రవరి 2 న అమెరికాతో..  ఫిబ్రవరి 6న అమెరికాతో తలపడుతుంది. జియో హాట్‌స్టార్ యాప్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోవార్మప్ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. 

ALSO READ : కివీస్తో నాలుగో టీ20.. సంజూ శాంసన్కు ఇదే లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాన్స్!

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఎటువంటి వార్మప్ మ్యాచ్‌లు ఆడవు. ఈ మూడు జట్లు వరల్డ్ కప్ ముందు ద్వైపాక్షిక సిరీస్ ఆడనున్నాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్ ఒక్కొక్క వార్మప్ మ్యాచ్ ఆడతాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడుతూ టీమిండియా బిజీగా ఉంది. శనివారం (జనవరి 31) తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ముగుస్తుంది. నాలుగు రోజుల తర్వాత భారత జట్టు సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. వరల్డ్ కప్ లో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న యూఎస్ఏ తో ఆడనుంది. ఫిబ్రవరి 15న పాకిస్థాన్ తో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. 

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ వార్మప్ షెడ్యూల్:

ఫిబ్రవరి 2    ఆఫ్ఘనిస్తాన్ vs స్కాట్లాండ్    (బెంగళూరు)    మధ్యాహ్నం 3:00 గం
.
ఫిబ్రవరి 2    ఇండియా ఎ vs అమెరికా    (నవీ ముంబై)    సాయంత్రం 5:00 గం.

ఫిబ్రవరి 2    కెనడా vs ఇటలీ    (చెన్నై)    రాత్రి 7:00 గం.

ఫిబ్రవరి 3    శ్రీలంక A vs ఒమన్    (కొలంబో)    మధ్యాహ్నం 1:00 గం.

ఫిబ్రవరి 3    నెదర్లాండ్స్ vs జింబాబ్వే (కొలంబో) మధ్యాహ్నం 3:00 గం.

ఫిబ్రవరి 3    నేపాల్ vs యుఎఇ    (చెన్నై)    సాయంత్రం 5:00 గం.

ఫిబ్రవరి 4    నమీబియా vs స్కాట్లాండ్    (బెంగళూరు) మధ్యాహ్నం 1:00 గం.

ఫిబ్రవరి 4    ఆఫ్ఘనిస్తాన్ vs వెస్టిండీస్    (బెంగళూరు)    మధ్యాహ్నం 3:00 గం.

ఫిబ్రవరి 4    ఐర్లాండ్ vs పాకిస్తాన్  (కొలంబో)    సాయంత్రం 5:00 గం.

ఫిబ్రవరి 4    భారత్ vs దక్షిణాఫ్రికా    (నవీ ముంబై)    రాత్రి 7:00 గం.

ఫిబ్రవరి 5    ఒమన్ vs జింబాబ్వే    (కొలంబో)    మధ్యాహ్నం 1:00 గం.

ఫిబ్రవరి 5    కెనడా vs నేపాల్    (చెన్నై)    మధ్యాహ్నం 3:00 గం.

ఫిబ్రవరి 5    న్యూజిలాండ్ vs అమెరికా (నవీ ముంబై)    సాయంత్రం 5:00 గం.

ఫిబ్రవరి 6    ఇటలీ vs యుఎఇ    (చెన్నై)    మధ్యాహ్నం 3:00 గం.

ఫిబ్రవరి 6    ఇండియా A vs నమీబియా    (బెంగళూరు)    సాయంత్రం 5:00 గం.