కివీస్తో నాలుగో టీ20.. సంజూ శాంసన్కు ఇదే లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాన్స్!

కివీస్తో నాలుగో టీ20.. సంజూ శాంసన్కు ఇదే లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాన్స్!

న్యూజిలాండ్‌‌తో టీమిండియా బుధవారం (జనవరి 28) నాలుగో టీ20 ఆడనుంది. ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 3-0తో కైవసం చేసుకున్న ఇండియా.. క్లీన్ స్వీప్ లక్ష్యంగా నాలుగో టీ20లో బరిలోకి దిగుతోంది. ఈ పోరులో ఫోకస్​ మొత్తం స్పిన్నర్ల పెర్ఫామెన్స్‌‌పైనే ఉంది.

విశాఖపట్నం: సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ.. వరుసగా మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు సాగర తీర నగరం వైజాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఆ జట్టును పడగొట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 3–-0తో కైవసం చేసుకున్న సూర్యకుమార్ సేన బుధవారం (జనవరి 28) జరిగే నాలుగో టీ20లోనూ గెలిచి  క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 

ఈ పోరులో టీమిండియా స్పిన్నర్ల పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అందరి ఫోకస్ ఉండనుంది. సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరంభం నుంచి ఇండియా బ్యాటర్లు దంచికొడుతున్నారు. అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ధనాధన్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ముఖ్యంగా యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనర్ అభిషేక్ శర్మ 300 ప్లస్  స్ట్రైక్ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రన్స్ రాబడుతుండటం విశేషం. 200 ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 15 ఓవర్లలో.. 150 పైచిలుకు లక్ష్యాన్ని పది ఓవర్లోనే ఛేజ్ చేయడం చూస్తుంటే, కివీస్ బౌలర్లకు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ నిద్రలేకుండా చేసేలా కనిపిస్తోంది.

 బ్యాటింగ్ విభాగం అద్భుతంగా ఉన్నప్పటికీ ఇండియా స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఫామ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాస్త కలవరపెడుతోంది. ముఖ్యంగా రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో రెండే వికెట్లు తీసిన కుల్దీప్ భారీగా రన్స్ ఇచ్చుకుంటున్నాడు. మూడో టీ20లో బుమ్రా, రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రత్యర్థిని 153/9 స్కోరుకే కట్టడి చేసినా.. కుల్దీప్ మూడు ఓవర్లలో 32 రన్స్ ఇచ్చుకున్నాడు. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విశ్రాంతి తీసుకున్న వరుణ్ హైస్కోర్లు నమోదైన తొలి రెండు టీ20ల్లో కుల్దీప్ కంటే ఫర్వాలేదనిపించాడు. కానీ, వరుణ్ నుంచి మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఆశిస్తోంది. ఇక వరుణ్ గైర్హాజరీలో  మూడో టీ20లో బరిలోకి  దిగి సూపర్ బౌలింగ్ చేసిన రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తారా?  అతని కోసం కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పక్కనపెడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

ఇండియాటీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం అందరి దృష్టి సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఉంది. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  తనకు ఇష్టమైన ఓపెనింగ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పగించినప్పటికీ శాంసన్ 3 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో  16 రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచాడు. తిలక్ వర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో సంజూకు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో అవకాశం దక్కొచ్చు. ఒకవేళ ఇక్కడ కూడా విఫలమైతే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతని స్థానం ప్రశ్నార్థకమే. కానుంది. 

కివీస్ గెలిచేనా?

న్యూజిలాండ్ జట్టుకు ఈ సిరీస్ ఏమాత్రం కలిసిరావడం లేదు. ముఖ్యంగా ఆ టీమ్ బౌలర్లు ఆతిథ్య బ్యాటర్ల ధాటికి తట్టుకోలేకపోతున్నారు. మ్యాట్ హెన్రీ (13.80 ఎకానమీ), కైల్ జేమీసన్ (14.20), శాంట్నర్ (13.14), ఇష్ సోధీ (12.50) వంటి సీనియర్ బౌలర్లు కూడా భారీగా  రన్స్ ఇచ్చుకోవడం కివీస్ కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీస్తోంది. ఆ టీమ్ బౌలర్లలో జాకబ్ డఫీ ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డారిల్ మిచెల్ ఒక్కడే కాస్త ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. ఈ లెక్కన కివీస్ గెలవాలంటే ఆ టీమ్ అద్భుతంగా ఆడాల్సిందే. 

పిచ్/ వాతావరణం

వైజాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసీఏ–-వీడీసీఏ స్టేడియం బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  అనుకూలం. మరో హైస్కోరింగ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆశించొచ్చు. రాత్రి పూట మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి టాస్ కీలకం కానుంది.