మహారాష్ట్ర బారామతి ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన యాక్సిడెంట్ లో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో సహా ఫ్లయిట్ అటెండర్ పింకీ మాలి కూడా చనిపోయారు. ఫ్లయిట్ అటెండర్ గా పింకీకి చాలా అనుభవం ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో చాలా సార్లు అజిత్ కుమార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానంలో.. ఫ్లయిట్ అటెండర్ గా పింకీ మాలిని కేటాయిస్తూ వచ్చింది కంపెనీ. విమాన ప్రమాదం తర్వాత పింకీ మాలి తండ్రి.. తన కుమార్తె చివరి మాటలను గుర్తు చేసుకుంటూ.. కన్నీటి పర్యంతం అయ్యాడు. పింకీ మాలి తండ్రితో మాట్లాడిన చివరి మాటలు ఇలా ఉన్నాయి.
‘నిన్న నా కూతురు పింకీమాలి ఫోన్ చేసింది. నాన్న..నేను అజిత్ పవార్ తో కలిసి బారామతికి వెళ్తాను, అక్కడి నుంచి నాందెడ్ వెళ్తాను అని చెప్పింది. కొన్ని రోజుల నుంచి అజిత్ పవార్ ఫ్లైట్ లో సహ అటెండర్ గా పింకి వెళ్తోంది. గత నాలుగైదు ప్రయాణాల్లో పింకీ మాలి అజిత్ పవార్ తో కలిసి వెళ్లింది’ అని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. పింకీ వర్క్ విషయంలో ఎంతో అంకితభావంతో పనిచేసే ఫ్రోఫెషనల్ అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె పని పట్ల తమకు గర్వంగా ఉందన్నారు.
►ALSO READ | సంజయ్ గాంధీ నుంచి అజిత్ పవార్ వరకు.. విమాన ప్రమాదాల్లో మృతిచెందిన ప్రముఖులు
మహారాష్ట్రని బారామతిలో బుధవారం (జనవరి 28) ఉదయం 8.48 గంటలకు జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు ఐదుగురు మృతి చెందారు. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా.. బారామతి ఎయిర్ పోర్టులో ప్లేన్ క్రాష్ అయ్యింది. VT-SSK లియర్ జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ టెక్నికల్ సమస్యలతో ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయినట్లు డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది. ఫ్లైట్ లో అజిత్ పవార్ త పాటు ఒక పర్సనల్ సెక్యూరిటీ అధికారి, ఒక అటెండెంట్ ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు క్రూ మెంబర్లు కూడా విమానంలో ఉన్నారు.
