హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేట ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్పై కారు ఆపి భోజనం చేస్తున్న వారిపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కంటైనర్ మీదనుంచి వెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను మౌలాలి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
శామీర్ పేట్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
