BCCI Controversy: భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించిన వార్షిక నమన్ అవార్డ్స్ కార్యక్రమంలో జరిగిన కొన్ని తప్పిదాల కారణంగా సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మార్చి 15న ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో 2025వ ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అవార్డులు అందజేయడంతో పాటు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత జట్లను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పురుషుల జట్టు 2025లో గెలిచిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2026లో సాధించిన టీ20 ప్రపంచకప్ విజయాలకు గాను సత్కారం చేసింది. అలాగే మహిళల జట్టు 2025లో వన్డే ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో బీసీసీఐ ప్రత్యేకంగా అభినందించింది.
అలాగే2025లో అండర్-–19 మహిళల ప్రపంచకప్ గెలిచిన, 2026లో అండర్–-19 మెన్స్ ప్రపంచకప్ సాధించిన జట్లకు కూడా బీసీసీఐ ప్రత్యేకంగా సత్కారం చేసింది. అండర్–-19 మహిళల జట్టు కెప్టెన్ నిక్కీ ప్రసాద్ నేతృత్వంలో విజయం సాధించినప్పటికీ, స్టేజ్‌పై ప్రదర్శించిన గ్రాఫిక్‌లో మాత్రం హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని సీనియర్ మహిళల జట్టు ప్రపంచకప్ గెలిచిన ఫోటోను ప్రదర్శించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. విజేత జట్ల నుంచి ముగ్గురు ప్లేయర్స్ ని స్టేజ్‌పైకి ఆహ్వానించి ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లేతో మాట్లాడించారు. ఈ సందర్భంగా మహిళల ప్రపంచకప్ గెలిచిన జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన పురుషుల జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్టేజ్‌పై పాల్గొన్నారు.
ALSO READ : SRHని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన రోహిత్..
2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో నిర్వాహకులు మరో పొరపాటు కూడా చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ పేరు ప్రదర్శించడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 2025లో అద్భుత ప్రదర్శన చేసిన గిల్‌కు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ క్రికెటర్‌గా (పురుషుల విభాగంలో) శుభ్‌మాన్ గిల్ అత్యంత ప్రతిష్టాత్మకమైన (పాలీ ఉమ్రిగర్ అవార్డును) క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. 2025లో అన్ని ఫార్మాట్లలో కలిపి 35 మ్యాచ్‌లలో 1,764 పరుగులు చేసి, సగటు 49తో 7 సెంచరీలు చేసి, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. కాగా ఈ కార్యక్రమంలో జరిగిన పొరపాట్లు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తూ బీసీసీఐపై క్రికెట్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
A special moment for a special team 👏
— BCCI (@BCCI) March 15, 2026
🎥 India’s U19 Women team are felicitated by former #TeamIndia players Sudha Shah and Shubhangi Kulkarni at the #NamanAwards 2026 for winning the #U19WorldCup🏅 pic.twitter.com/ebLkTCr4za
If it's a mistake, it's a question mark on the professionalism of the telecast. It's a hygiene issue where basic things are not checked.
— Amit T (@amittalwalkar) March 16, 2026
If it's a PR (I don't think so), it's an extremely poor attempt.
The guy is getting due recognition (Cricketer of the year). He doesn't need… pic.twitter.com/WDTpaehw0N
