ఎమ్మెల్యేలు దిగజారారు.. చంద్రబాబు లోకేష్ అండతో రెచ్చిపోతున్నారు: జగన్

ఎమ్మెల్యేలు దిగజారారు.. చంద్రబాబు లోకేష్ అండతో రెచ్చిపోతున్నారు: జగన్

బుధవారం ( జనవరి 28 ) భీమవరం వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు వైసీపీ అధినేత జగన్. ఈ సమావేశంలో మాట్లాడుతూ కూటమి నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్. కూటమి ఎమ్మెల్యేలు దిగజారారిపోయారని.. చంద్రబాబు, లోకేష్ అండతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని అన్నారు జగన్. మద్యంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని.. మద్యం షాపులన్నీ చంద్రబాబు మనుషులవేనని అన్నారు జగన్.

సంక్రాంతి సమయంలో కోడిపందాలకు వేలం నిర్వహించారని.. పులివెందులలో కూడా వేలం నిర్వహించారని.. ప్రభుత్వమే దగ్గరుండి అన్నీ చేయించిందని అన్నారు. కూటమి నేతల బరితెగింపునకు అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగిని వేధించారని.. కూన రవికుమార్, కోనేటి ఆదిమూలం కూడా అలాగే ప్రవర్తించారని అన్నారు జగన్. మంత్రి వాసంశెట్టి రికార్డింగ్ డ్యాన్సులు చేశారని.. చంద్రబాబు, లోకేష్ ల అండతోనే నేతలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని అన్నారు జగన్.

రెండేళ్లలో చంద్రబాబు రూ.3లక్షల కోట్లు అప్పు చేశారని... ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది, ఎవరికి పోయిందని ప్రశ్నించారు. ఆదాయమంతా చంద్రబాబు, ఆయన మనుషుల జేబుల్లోకి పోతోందని అన్నారు జగన్. మద్యంలో భారీ అవినీతి జరుగుతోందని... మద్యం షాపులన్నీ చంద్రబాబు మనుషులవేనని... బెల్టు షాపులు కూడా చంద్రబాబు మనుషులవేనని అన్నారు. ఎమ్మార్పీ ధరలకు మద్యం అమ్మడం లేదని మండిపడ్డారు జగన్.