మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్..

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్..

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్టైన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు పోలీసులు. సోమవారం ( మార్చి 16 ) నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ మహేష్ తో పాటు ఈ కేసులో అరెస్టైన ప్రియాంక రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి విడుదల చేశారు పోలీసులు. ఈ కేసులో అరెస్టైన మిగతా నిందితులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను ఉప్పరపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు పోలీసులు.

ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఈగల్ టీం విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో మొత్తం 11 మందిని ఒక్కొక్కరుగా  విచారిస్తున్నారు పోలీసులు. విచారణలో కీలక సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు. పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి.. సరఫరా చేసిన నెట్వర్క్ ఎవరిదీ.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

►ALSO READ | మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పాజిటివ్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కూడా ఉండటంతో ఈ కేసు అటు ఏపీని కూడా షేక్ చేస్తోంది.మార్చి 14న రాత్రి ర్యాండమ్ చెకింగ్ లో భాగంగా పార్టీలో పాల్గొన్న అందరికీ డ్రగ్స్ టెస్టు నిర్వహించారు. 

ఈ టెస్టులో మొదట పుట్టా మహేష్ కుమార్ కు నెగిటివ్ గా రాగా.. తర్వాత బ్లడ్ శాంపుల్ లో పాజిటివ్ గా రావడంతో ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పట్టుబడిన 11 మందిలో 6 మందికి పాజిటివ్ రాగా అందులో ఎంపీ మహేష్ కూడా ఉండటం గమనార్హం. దీంతో మహేష్ యాదవ్ ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. డ్రగ్స్ పార్టీలో మహేష్ పాల్గొనడంతో పాటు వివిధ అంశాలపై విచారణ జరుపుతున్నారు.