మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పాజిటివ్

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పాజిటివ్

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.  బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో  పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీ పుట్ట మహేష్ కూడా ఉండటంతో ఈ కేసు అటు ఏపీని కూడా షేక్ చేస్తోంది. 

మార్చి 14న రాత్రి ర్యాండమ్ చెకింగ్ లో భాగంగా పార్టీలో పాల్గొన్న అందరికీ డ్రగ్స్ టెస్టు నిర్వహించారు. ఈ టెస్టులో పుట్ట మహేష్ కుమార్ కు నెగిటివ్ గా రాగా.. లేటెస్టుగా బ్లడ్ శాంపుల్ లో పాజిటివ్ గా రావడంతో ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పట్టుబడిన 11 మందిలో 6 మందికి పాజిటివ్ రాగా అందులో  ఎంపీ మహేష్  కూడా ఉండటం గమనార్హం. దీంతో మహేష్ యాదవ్ ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. డ్రగ్స్ పార్టీలో మహేష్ పాల్గొనడంతో పాటు వివిధ అంశాలపై విచారణ జరుపుతున్నారు. 

డ్రగ్స్, రివాల్వర్లు, విదేశీ మద్యం సీజ్:

మొయినాబాద్ పోలీస్ స్టేషన్ SI నయిమ్ఉద్దీన్  చెప్పిన వివరాల ప్రకారం..  నిందితుల నుంచి 32  జర్మనీ తయారీ రివాల్వర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  ఒక లైవ్ రౌండ్, నాలుగు ఖాళీ కార్ట్రిడ్జ్‌లు సీజ్ చేశారు. పార్టీకి హాజరైన 10 మంది పురుషులు, ఒక మహిళపై కేసు నమోదు చేశారు.  పైలెట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ దగ్గర నుంచి కోకైన్ స్వాధీనం చేసుకున్నారు.   భారీగా విదేశీ మద్యం బాటిళ్లు,48 బీర్ బాటిళ్లు, డాన్ జూలియో, రాయల్ సల్యూట్, చీవాస్, బెల్వెడేర్ వోడ్కా సీజ్ చేశారు.  

పార్టీకి హాజరైన 11 మందిలో ఐదుగురికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు  తెలిపారు పోలీసులు.  వీరిలో  తిరువీడుల అర్జున్ రెడ్డి, కౌషిక్ రవి,  రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, పంజుగుల రోహిత్ రెడ్డి, టిడిపి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. 

FIR లో మొత్తం 11 మంది

  • మోరవినేని రమేష్
  • పుట్ట మహేష్ కుమార్
  • పంజుగుల రోహిత్ రెడ్డి
  • వరమచనేని శ్రావణ్ కుమార్
  • నమిత్ శర్మ
  • పంజుగుల రితేష్ రెడ్డి
  • నల్లపనేని విజయ కృష్ణ
  • కౌషిక్ రవి
  • తిరువీడుల అర్జున్ రెడ్డి
  • ఆర్. ప్రియాంక రెడ్డి
  • సిల్వరి శరత్ కుమార్