బుధవారం ( జనవరి 28 ) కరీంనగర్ డీసీసీ ఆఫీసులో మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఆశావహులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు పొన్నం ప్రభాకర్. ప్రజా పాలన ప్రభుత్వం లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాల వలె పట్టణాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక తో ముందుకు పోతున్నామని అన్నారు. ఇప్పటికే పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని... కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు పొన్నం ప్రభాకర్.
కరీంనగర్ కార్పొరేషన్ లో అభ్యర్థుల ఎంపికకు 66 సీట్లలో సర్వే జరుగుతుందని.. ఎవరికివారు అంచనా వేసుకోండని ఆశావహులకు సూచించారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా ప్రజా పాలనపై ప్రజలు పాజిటివ్ గా ఉన్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో వివరిస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని.. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆర్టీసీకి 9 వేల కోట్లు చెల్లించిందని అన్నారు.
►ALSO READ | మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుస్తాం: భట్టి విక్రమార్క
200 యూనిట్ల ఉచిత విద్యుత్,సన్న బియ్యం పంపిణీ,నూతన రేషన్ కార్డులు పంపిణీ, రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ,ఉద్యోగాల నియామకాలు , సన్న వడ్లు బోనస్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, నియోజకవర్గనికి 3, 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తుందని అన్నారు. పోటీ చేసే ఆశావహులు వార్డుల్లో తిరుగుతూ బలోపేతం చేయాలని..టికెట్ ఎవరికి వచ్చినా..అందరూ కలిసి సమన్వయం చేసుకుంటూ గెలవాలని అన్నారు.
రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్ ఇంచార్జి గా ఉన్నారని..సెలెక్ట్ ఎలెక్ట్ ద్వారా మీకు మీరే వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకునేలా కృషి చేయాలని అన్నారు పొన్నం ప్రభాకర్.
