మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలిచి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో మీడియాతో మాట్లాడిన భట్టి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు.
నగరాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుల అంశం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు భట్టి. తమ కేబినెట్ అంతా ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తుంది.. రాష్ట్ర భవిష్యత్తే తమ లక్ష్యమని అన్నారు. ప్యూర్, క్యూర్, రేర్ సమగ్ర విధానంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామన్నారు భట్టి.
►ALSO READ | మోడీ పేదవాళ్ల... నోటి కాడి ముద్ద లాక్కోవాలని చూస్తుండు : మహేశ్ కుమార్ గౌడ్
సీఎం రేవంత్ రెడ్డి దే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తనకు కొన్ని సూచనలు చేశారని చెప్పారు భట్టి. మంత్రులు తెలియజేసిన సమస్యలను తాను ముఖ్యమంత్రికి వివరించానని చెప్పారు. ప్రజాభవన్లో మంత్రుల భేటీపై కొందరు పిచ్చి భ్రమల్లో ఉండి పిచ్చి రాతలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు భట్టి. మంత్రులు డిప్యూటీ సీఎంను కలవకపోతే ఇంకెవరిని కలుస్తారని ప్రశ్నించారు భట్టి.
