ప్రధాని మోడీ పేదవాళ్ళ నోటికాడి ముద్దను లాక్కోవాలని చూస్తున్నాడని ఫైర్ అయ్యారు టీ పీసీసీ చీఫ్ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్. జాతీయ ఉపాధి హామీ చట్టం పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ మెదక్ జిల్లాలో MGNREGA బచావో, బీజేపీ హటావో నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మోడీ గరీబోళ్లను కష్ట డుతున్నారని అన్నారు. గరిబోళ్ళకోసం సోనియా గాంధీ అనంతపురం పర్యటనలో ఉన్నపుడు పనికి ఆహార పథకం తీసుకొచ్చారని చెప్పారు.
అనంతరపురంలో అన్ని ఇళ్లకు తాళాలు ఉంటే...సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కు చెప్పి పనికి ఆహార పథకాన్ని మొదలు పెట్టారని చెప్పారు. గ్రామ జనం పటిష్టంగా ఉంటే గ్రామాలు సౌభాగ్యంగా ఉంటాయన్నారు. కానీ మోడీ, అదానీ, అంబానీల కోసం పనికి ఆహర పథకాన్ని తొలగించాలని చూస్తున్నారని విమర్శించారు. పనికి ఆహర పథకం కోసం సోనియా గాంధి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నారని చెప్పారు.
ఫిబ్రవరి నాటికి గ్రామీణ ఉపాధీ హామీ పథకం తీసుకొచ్చి 20 ఏళ్లు పూర్తవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గరిబోళ్ల పార్టీ, ఎస్సీ,ఎస్టీ ,బీసీల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది
మోడీకి వ్యతిరేకంగా గ్రామాల్లో మహిళలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మహేహ్ కుమర్ .
