Shilpa Shetty: శిల్పాశెట్టి హోటల్ ముందు కిలోమీటర్ల క్యూ.. అమ్మకై ఆఫర్‌తో ఎగబడ్డ జనం.!

Shilpa Shetty: శిల్పాశెట్టి హోటల్ ముందు  కిలోమీటర్ల క్యూ..  అమ్మకై ఆఫర్‌తో ఎగబడ్డ జనం.!

బాలీవుడ్ నటి,  ఫిట్‌నెస్ క్వీన్ శిల్పా శెట్టి నిత్యం వార్తల్లో ఉంటారు. నటిగానే కాకుండా బిజినెస్ వ్వవహారాల్లోనూ ఫుల్ బిజీ ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మ లేటెస్టుగా ప్రారంభించిన   'అమ్మకై' (AmmaKai) రెస్టారెంట్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ పెడతామని ప్రకటించడమే ఆలస్యం.. జనం ఎగబడ్డారు. హోటల్ ముందు క్యూ కట్టారు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ముంబై నడిబొడ్డున 'ఫ్రీ' ఫీవర్!

ముంబైలోని బాంద్రాలో శిల్పాశెట్టి కొత్తగా ప్రారంభమైన 'అమ్మకై' రెస్టారెంట్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచితంగా బ్రేక్ ఫాస్ట్ అందిస్తామని ప్రకటించింది. అయితే ఇది 'ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత'  ప్రాతిపదికన అని తెలిపారు. ఇంకేముంది? ఉదయం 7 గంటల నుంచే రెస్టారెంట్ ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ప్రత్యక్షమయ్యాయి. విలాసవంతమైన కార్లలో వచ్చిన వారు సైతం సామాన్యులతో పోటీ పడి క్యూలో నిలబడ్డారు. 

'అమ్మకై' వెనుక ఉన్న అసలు కథేంటి?

ముంబైలో ఇప్పటికే పాపులర్ అయిన 'బాస్టియన్' గ్రూప్‌కు చెందినదే ఈ 'అమ్మకై'. శిల్పా శెట్టి దీనికి సహ యజమాని. ఈ హోటల్ మంగళూరు రుచులకు, ప్రత్యేకించి సౌత్ ఇండియన్ టచ్‌తో కూడిన ప్రీమియం డైనింగ్‌కు ఇది పెట్టింది పేరు. మంగళూరు స్పెషల్ వంటకాలతో పాటు ఆసియా, కాలిఫోర్నియా , యూరోపియన్ వంటకాల కలబోత ఇక్కడ లభిస్తుంది. ఈ హోటల్ ఇప్పుడు బాంద్రా లోనే కాకుండా, దాదర్‌లోని కోహినూర్ స్క్వేర్‌లో లగ్జరీ రూఫ్‌టాప్ స్పేస్‌తో ఈ బ్రాండ్ ను నడిపిస్తున్నారు.

 ఇది ఆకలా? లేక ఉచితం అనే పిచ్చా?

ఉచితంగా బ్రేక్ ఫాస్ట్ అందిస్తామనడంతో జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రియాక్టర్ అయ్యారు.  ఈ "రిపబ్లిక్ డే నాడు ఇంత మంచి ఆఫర్ ఇవ్వడం గొప్ప విషయం. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదొక మార్గం" అని కొందరు శిల్పా శెట్టిని అభినందించారు. మరి కొందరు లగ్జరీ ఏరియాల్లో ఉంటూ, ఖరీదైన ఫోన్లు వాడుతూ.. కేవలం ఒక ఫ్రీ మీల్ కోసం గంటల తరబడి రోడ్డుపై నిలబడటం అవసరమా? అని విమర్శిస్తున్నారు. దీన్నే 'ఫ్రీబీ మైండ్‌సెట్'  అని నెటిజన్లు పిలుస్తున్నారు. డబ్బు ఉన్నవారు కూడా ఉచితం అనగానే ఎగబడటం మన సామాజిక ప్రవర్తనలోని వైరుధ్యాన్ని చూపిస్తోంది అని ఒక నెటిజన్ చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

కేవలం ఒక్క రోజు ఆఫర్‌తో ప్రారంభమైన ఈ ఇష్యూ, ఇప్పుడు భారతదేశంలో పెరుగుతున్న 'ఉచితాల' సంస్కృతిపై చర్చకు దారితీసింది. ఒక సెలబ్రిటీ రెస్టారెంట్‌కు ఇది అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ కావొచ్చు, కానీ సమాజంలోని ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తులు కూడా ఉచితం కోసం చూపించిన ఆత్రుత.. మన దేశంలో 'ప్రివిలేజ్',  'సామాజిక విలువలను' ప్రశ్నిస్తోంది. మొత్తానికి, శిల్పా శెట్టి పెట్టిన ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్.. కొందరికి కడుపు నింపగా.. మరి కొందరిలో మాత్రం ఆలోచనలను రేకెత్తించింది..