అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమతా బెనర్జీ అనుమానాలు..

అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమతా బెనర్జీ అనుమానాలు..

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాద మృతిపై అనుమానం వ్యక్తం చేశారు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ. ప్రమాద ఘటన వెనుక ఉన్న నిజాలేంటో తేల్చాలని అన్నారు. సుప్రీం కోర్టు నేతృత్వంలో కమిటీ వేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తమకు సుప్రీం కోర్టు పైన నమ్మకం ఉందని.. ఇతర సంస్థలు, ఏజెన్సీలపై నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బుధవారం (జనవరి 28) మహారాష్ట్ర బారామతి జిల్లాలో జరిగిన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు ఐదు మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన దీదీ.. విమానం క్రాష్ అయిన వార్త విని షాక్ కు గురైనట్లు చెప్పారు. ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందేమో అని అనుమానాలు వ్యక్తం చేశారు.

బీజేపీని వీడుతున్నారంటూ ప్రచారం.. అంతలోనే ఘటన ?

అజిత్ పవార్ బీజేపీ-మహాయుతి కూటమిని వీడుతున్నారన్న వార్త ఇటీవల మహారాష్ట్ర పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. మహాయుతీతో దోస్తీ కట్ చేసుకుని మళ్లీ బాబాయ్ చెంతకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు ఇరు కుటుంబాలు ప్రకటన చేశాయి కూడా. త్వరలో మళ్లీ సొంత గూటికి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ ఘటన జరగటంపై దీదీ అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీని కాదనే నేతల విషయంలో సేఫ్టీ, సెక్యూరిటీ లేదని ఆమె ఆరోపించారు. 

బుధవారం (జనవరి 24) సుప్రియా సూలే నియోజకవర్గం అయిన బారామతిలో జిల్లా పరిషద్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ప్లేన్ క్రాష్ అయిన విషయం తెలిసింది. ఉదయం 8.48 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందే.