ఢిల్లీ: ఇకపై ఆధార్ లో అడ్రస్ మార్పిడి కోసం మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఫోన్ నంబర్ అప్డేట్ కోసం ఇబ్బందులు పడాల్సిన పనేలేదు. మీ అరచేతిలోకే అన్ని ఆప్షన్లు వచ్చేశాయి. ఇలాంటి సౌకర్యాలున్న కొత్త యాప్ ను కేంద్ర ప్రభుత్వం ఇవాళ లాంచ్ చేసింది. దేశంలో పెరుగుతున్న డిజటల్ అవసరాలను బలోపేతం చేసేందుకు దీనిని తీసుకొచ్చింది.
ఇవాళ ఢిల్లీలో డాక్టర్.అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ యాప్ను జాతికి అంకితం చేశారు. ఈ కొత్త యాప్తో ఆధార్ సర్వీసులు మరింత సులభంగా, సురక్షితంగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనున్నాయి. అయితే ఈ కొత్త యాప్ లో చాలా ఫీచర్లు ఉన్నాయి. ఈ యాప్ ద్వారా వెంటనే ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఆధార్ కాంటాక్ట్ కార్డు ద్వారా తమ వివరాలను దాచుకోవచ్చు. తమ వివరాలు ఎవరీకైనా షేర్ చేసినప్పుడు మొత్తం వివరాలు కాకుండా అవసరమైనవి మాత్రమే కన్పించేలా సెండ్ చేయవచ్చు. మరోవైపు ఈ యాప్ ద్వారా ఐదుగురు ప్రొఫైల్స్ క్రియేట్ చేయవచ్చు. 2009లో ఇదే రోజున ఆధార్ కార్డును లాంచ్ చేశారు.
