బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు తన అందం, అభినయంతో కోట్లాది మంది అభి నూనులను సంపాదించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. సినిమా షూటింగ్స్ తో ఎంత ఫుల్ బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్ పిక్స్ షేర్ చేస్తూ.. తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటుంది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నా యి.
ఎలిగెంట్ లుక్ లో మెరిసిపోతూ..
ఎప్పుడూ ట్రెండీగా ఉండే తమన్నా ఈసారి క్లాసిక్, ఎలిగెంట్ లుక్ లో మెరిసిపోతూ యువత గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. మినిమల్ మేకప్, సింపుల్ హెయిర్ స్టైల్, ఆమె సిగ్నేచర్ స్మైల్ తో కెమెరాకు పోజులిచ్చిన తీరు నేటిజన్లను కట్టిపడేస్తోంది. ఎలిగెన్స్ అంటే కేవలం బట్టలు మాత్రమే కాదని, అది మన ఆటిట్యూడ్ లో ఉంటుందని చెప్పకనే చెప్పింది. స్టైలిష్ అవుట్ ఫిట్ లో మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీని చూసి అభిమానులు క్వీన్ ఆఫ్ స్టైల్, ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
బాలీవుడ్ పై ఫోకస్..
ప్రస్తుతం తమన్నా.. సౌత్ మూవీస్ తగ్గించి బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టి పనిచేయాలని నిర్ణయించుకుంది. ఒకే సారి తెలుగు, తమిళం, హిందీ భాషల్ని మ్యానేజ్ చేయడం కష్టంగా మారడంతో.. బాలీవుడ్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బాలీవుడ్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రలు, వెబ్ సిరీస్‌ల వైపు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఓ సినిమాతో పాటు.. కరీనా కపూర్ 'క్రూ 2'. 'గోల్ మాల్ 5' , మడాక్ ఫిలిమ్స్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగమవ్వాలని ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
►ALSO READ | Weekend OTT Releases: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ హిట్స్.. జనవరి 30న స్ట్రీమింగ్ కానున్న టాప్ చిత్రాలు ఇవే!
ఇప్పటికే ఆ చిత్రాల దర్శక, నిర్మాతలకు టచ్ లోకి వెళ్లిందట. ఈ నేపథ్యంలోనే కార్తీక్ ఆర్యన్ నటిస్తోన్న నాగ్ జిల్లా ప్రాజెక్టును కావాల నాగ్ కావాలనే వదులుకుందని టాక్ వినిపిస్తోంది . మొత్తానికి, దక్షిణాదిలో 'కావాలయ్యా' అంటూ స్టెప్పులేయించిన ఈ బ్యూటీ.. ఇకపై ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమైంది. 2026లో తమన్నా బాలీవుడ్ కలలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి మరి !
