ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్

ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం. ఫిబ్రవరి 11 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది.

అనంతరం ఫిబ్రవరి 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు సభలో మాట్లాడనున్నారు.సీఎం ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ ప్రణాళిక వంటి కీలక అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.

►ALSO READ | ఎమ్మెల్యేలు దిగజారారు.. చంద్రబాబు లోకేష్ అండతో రెచ్చిపోతున్నారు: జగన్

ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు సుమారు నాలుగు వారాల పాటు జరగనున్నాయని తెలుస్తోంది... అంటే, మార్చి 12వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.