బుచ్చిబాబు మెచ్చిన ‘శ్రీ చిదంబరం గారు’.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్!

బుచ్చిబాబు మెచ్చిన ‘శ్రీ చిదంబరం గారు’.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్!

నటుడు వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం  ‘శ్రీ చిదంబరం గారు’ . ఈ మూవీ వినయ్‌రత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా, కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా మనసుని హత్తుకునే భావోద్వేగాలను పండించే 'ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా'గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాలతో చింతా వినీషారెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

బుచ్చిబాబు చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్

లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్‌ను ‘ఉప్పెన’, ‘పెద్ది’ చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆహ్లాదకరమైన వినోదంతో సాగడమే కాకుండా, చివర్లో వచ్చే ఒక డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. “తల దించుకుని నడిచి నడిచి మెడ లాగేస్తోందమ్మా.. ఇప్పుడన్నా నన్ను తలెత్తుకొనీయమ్మా అంటూ చిదంబరం పాత్రలో హీరో పలికే సంభాషణ గుండెలను పిండేస్తోంది. సమాజంలో ఆత్మగౌరవం కోసం పోరాడే ఒక మధ్యతరగతి వ్యక్తి కథ ఇదని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

►ALSO READ | Nagarjuna-Tabu: 'కింగ్ 100' లో క్రేజీ కాంబినేషన్.. 27 ఏళ్ల తర్వాత టబుతో మళ్ళీ మ్యాజిక్!

కీరవాణి గానం.. అదనపు బలం

ఈ సినిమాకు సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఆలపించిన ‘వెళ్లేదారిలోన’ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  టీజర్, పాటల ద్వారా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ట్రైలర్‌తో సినీ ప్రియులను మరింతగా ఆకట్టుకుంది.ఈ చిత్రం మన చుట్టూ ఉండే మనుషుల కథలా, నిత్యం మనం చూసే మధ్యతరగతి కష్టసుఖాల కలబోతలా అనిపిస్తోంది.ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రాబోతున్న ఈ 'చిదంబరం గారు' ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తారో వేచి చూడాలి.