Nagarjuna-Tabu: 'కింగ్ 100' లో క్రేజీ కాంబినేషన్.. 27 ఏళ్ల తర్వాత టబుతో మళ్ళీ మ్యాజిక్!

Nagarjuna-Tabu: 'కింగ్ 100' లో క్రేజీ కాంబినేషన్.. 27 ఏళ్ల తర్వాత టబుతో మళ్ళీ మ్యాజిక్!

టాలీవుడ్ లో 4 దశాబ్దాలుగా తనదైన స్టైల్, ప్రయోగాత్మక సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో అక్కినేని నాగార్జున. ఇప్పటికీ అదే క్రేజ్ తో ముందుకెళ్తున్నా రు. రొమాంటిక్ హీరోగా మొదలై, యాక్షన్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ తో పాటు ఇప్పుడు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. వయసు సంఖ్య మాత్రమేనని, నటనకు హద్దులుండవని ప్రతి చిత్రంలో నిరూపిస్తూనే ఉన్నారు ఈ టాలీవుడ్ మన్మథుడు...

భారీ అంచనాలతో కింగ్ 100వ చిత్రం..

 ప్రస్తుతం నాగార్జున.. తన 100వ మూనీని ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడు. తమిళ దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'కింగ్ 100' లేదా 'లాటరీ కింగ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నపూర్ణ స్టూ-డియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  నాగ్ 100 చిత్రం కావడంతో ఈ మూవీపై సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో అంచానాలు భారీగానే ఉన్నాయి.

నాగ్ సరసన టబు?

అయితే ఇందులో నాగ్ సరసస ఎవరూ ఊహించని విధంగా సీనియర్ నటి టబు కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ఇప్పుడు సినీ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. 'నిన్నే పెళ్లాడుతా" 'ఆవిడ మా అవిదే' వంటి సినిమాలతో ఈ జోడీ వెండితెరపై మ్యాజిక్ చేసింది. కార్తీక్ ఆమె కోసం ఒక పవర్ ఫుల్ అండ్ కీ రోల్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దాదాపు 27 ఏండ్ల తర్వాత మళ్లీ వీరు కలిసి నటించబోతున్నారన్న వార్త వినగానే అక్కినేని ఫాన్స్ ఖుషీ అవుతున్నారు... 

►ALSO READ | Tamannaah: మిల్కీ బ్యూటీ మెరుపులు.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న తమన్నా ఫోటోలు!