నార్సింగి దగ్గర..రన్నింగ్ లో ఉండగా తగలబడ్డ కారు

నార్సింగి దగ్గర..రన్నింగ్  లో ఉండగా తగలబడ్డ కారు

 హైదరాబాద్ శివారు నార్సింగి చౌరస్తా దగ్గర కారులో మంటలు చెలరేగాయి. రన్నింగ్ లో ఉన్న   మహేంద్ర ఎక్స్ యువి కారులో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి.  గమనించిన   డ్రైవర్ కారును పక్కకు ఆపడంతో క్షణాల వ్యవధిలోనే కారు అగ్నికి ఆహుతి అయింది.  స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలి బూడిద అయ్యింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.    కారులో టెక్నికల్ ప్రాబ్లం వల్ల మంటలు చెలరేగినట్లుగా పోలీసుల అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.