Australian Open 2026: ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌కు సిన్నర్.. జొకోవిచ్‌తో బ్లాక్ బస్టర్ ఫైట్‌కు రంగం సిద్ధం

Australian Open 2026: ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌కు సిన్నర్.. జొకోవిచ్‌తో బ్లాక్ బస్టర్ ఫైట్‌కు రంగం సిద్ధం

డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో తన హవా కొనసాగిస్తున్నాడు. హ్యాట్రిక్ టైటిల్స్ పై కన్నేసిన సిన్నర్ అదే రూట్ లో వెళ్తున్నాడు. బుధవారం (జనవరి 28) జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్‌ను వరుస సెట్లలో ఓడించి సెమీ ఫైనల్ కు దూసుకెళ్లాడు. మెల్‌బోర్న్ పార్క్‌లో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో 6-3, 6-4, 6-4 తేడాతో షెల్టన్‌ను అలవోకగా ఓడించాడు. 2024, 2025 లో వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్న సిన్నర్ 10 సార్లు విజేత  నోవాక్ జొకోవిచ్‌తో బ్లాక్‌బస్టర్ క్లాష్ కు సిద్ధమయ్యాడు.     

మ్యాచ్ మొత్తం సిన్నర్ ఆధిపత్యం సాగింది. టాప్ సీడ్ ముందు షెల్టన్ పూర్తిగా తేలిపోయాడు. ఒక్క సెట్ లో కూడా పోరాడలేకపోయాడు. కనీసం టై బ్రేక్ కు కూడా తీసుకెళ్లకుండా చేతులెత్తేశాడు. మరోవైపు సిన్నర్ మాత్రం దుమ్ములేపాడు. ఓవరాల్ గా సిన్నర్ మూడు బ్రేక్ పాయింట్లతో సత్తా చాటితే మరోవైపు షెల్టన్ ఒక బ్రేక్ కూడా సాధించలేకపోయాడు. మరో సెమీస్ లో 10 సార్లు ఛాంపియన్స్ నోవాక్ జొకోవిచ్ సెమీస్ కు దూసుకెళ్లాడు. ఐదో సీడ్ ముసెట్టి మ్యాచ్ ఆడలేక వైదొలగడంతో జొకోవిచ్ సెమీస్ కు అర్హత సాధించాడు. తొలి రెండు సెట్ లను గెలుచుకున్నప్పటికీ మూడో సెట్ లో గాయం కారణంగా ఆడలేకపోయాడు. 6-4, 6-3, 1-3 తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ముసెట్టి  మ్యాచ్ కొనసాగించ లేకపోయాయాడు. 

►ALSO READ | IND vs NZ 4th T20I: చెలరేగిన న్యూజిలాండ్ ఓపెనర్లు.. టీమిండియా ముందు బిగ్ టార్గెట్

నాలుగో రౌండ్ లో కూడా జొకోవిచ్ కు అదృష్టం కలిసొచ్చింది. ప్రత్యర్థి వాకోవర్ ఇవ్వడంతో మ్యాచ్ ఆడకుండానే క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లాడు. సెమీ ఫైనల్లో జోకొవిస్ హాట్ ఫామ్ లో ఉన్న సిన్నర్ తో సెమీస్ లో తలపడతాడు. మరో సెమీస్ లో కార్లోస్ అల్కరాజ్ మూడో సీడ్ జ్వరెవ్ తో తలపడతాడు. రెండు సెమీ ఫైనల్స్ శుక్రవారం (జనవరి 30) జరుగుతాయి. ఉమెన్స్ సెమీ క్వార్టర్ ఫైనల్స్ లో రైబాకిన 7-5,6-1 తేడాతో స్వైటెక్ పై గెలిచి సెమీస్ కు దూసుకెళ్లింది. మరో సెమీ ఫైనల్స్ లో అనిసమోవపై పెగుల 6-2, 7-6 తేడాతో విజయం సాధించింది.