ఆధారాలు బయటపెడితే బద్నాం చేస్తరా...? ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేస్త: మాజీ ఎమ్మెల్సీ కవిత

ఆధారాలు బయటపెడితే బద్నాం చేస్తరా...? ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేస్త: మాజీ ఎమ్మెల్సీ కవిత
  • ప్రపంచ బ్యాంక్కు మూసీ భూములను కట్టబెట్టే ప్రయత్నం
  • తెలంగాణలో చిన్న మోదీలా రేవంత్ రెడ్డి వ్యవహారం
  • ఇష్టమొచ్చినట్లుగా వీడియోలు పెట్టడానికి మీరు కంటెంట్ రైటర్లా?

హైదరాబాద్: ప్రపంచ బ్యాంక్ కు మూసీ పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. తాను ఆధారాలు బయ టపెడితే హైడ్రా, కాంగ్రెస్ ప్రభుత్వం బాయిలో దూకాలని సెటైర్వేశారు. తాను ప్రూఫ్స్ బయ. టపెడితే ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి తనను బదనాం చేస్తారా..? తమాషాలు చేస్తున్నారా? అని ఫైర్ అయ్యారు. హైడ్రా పెట్టిన ట్వీట్స్, డిలీట్ చేయాలని... లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. 

ఇప్పటివర కు మూసీపై కాంగ్రెస్ ప్రభుత్వం డీపీఆర్ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించా రు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి ఆఫీసులో కవిత మీడియాతో మాట్లాడారు. 'హైడ్రాతో సీఎం రేవంత్ రెడ్డి ఆరాచకం చేస్తున్నరు. 

►ALSO READ | సైబర్ నేరగాళ్ల వలలో ఏఎస్ఐ.. వీడియో కాల్ రికార్డింగ్‌తో బ్లాక్‌మెయిల్..రూ.96 వేలు కాజేశారు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఇప్పటి వరకు ఆరుఫి ర్యాదులు చేశాం. నాలాలు ఆక్రమించి విల్లాలు కడుతున్న సంస్థ తమ పరిధిలోకి రాదని హైడ్రాకమిషనర్ ఎలా అంటున్నరు. సిగ్గు లేకుండా రంగనాథ్ హైద్రా వీడియోలు తీసి పెడుతు న్నరు. ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు పెడు. తున్నరు.. మీరు కంటెంట్ రైటర్లు ఆఅ?" అని నిలదీశారు.