ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది: మీనాక్షి నటరాజన్ 

ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది: మీనాక్షి నటరాజన్ 

బుధవారం ( జనవరి 28 ) మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని అన్నారు. మా హక్కులను హరిస్తామంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని.. ఉపాధి హామీ పని చేయడం చాలా కష్టమని.. నేను కూడా ఉపాధి పనికి వెళ్ళానని అన్నారు. 

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూలీలలకు సరైన వేతనాలు ఇచ్చేవాళ్లమని.. బీజేపీ ప్రభుత్వం ఉపాధి కూలీలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

గ్రామాలలో ఉండే అభివృద్ది పనులను గ్రామ సర్పంచ్ తో చేసుకోవాలని.. ఢిల్లీ వాడు,  హైద్రాబాద్ వాడు గ్రామాలకు వచ్చి ఎం చేస్తాడని అన్నారు. గ్రామాలలో ఏం పనులు కావాలో ఢిల్లీలో ఉన్న బిజెపి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే రోజులు వస్తాయని అన్నారు మీనాక్షజీ నటరాజన్.