మైక్రోబేవరేజెస్ కు జీవో ఇచ్చింది మీరు..అనుమతులు ఇచ్చింది మీరు.. హరీష్ రావుపై మంత్రి జూపల్లి ఫైర్

మైక్రోబేవరేజెస్ కు జీవో ఇచ్చింది మీరు..అనుమతులు ఇచ్చింది మీరు.. హరీష్ రావుపై మంత్రి జూపల్లి ఫైర్

హైదరాబాద్​: బీఆర్​ ఎస్​ నేత హరీష్​ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్​ అయ్యారు. హరీష్​ రావు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు.. మైక్రోబేవరీలో అవకతవకలు జరిగాయంటూ.. మేమేదో డబ్బులు దండుకున్నట్లు హరీష్​ రావు ప్రచారం చేస్తున్నారు.. మైక్రోబేవరేజెస్​ కు జీవో ఇచ్చింది..అనుమతి ఇచ్చింది బీఆర్​ ప్రభుత్వమే.. ఏమీ తెలియనట్లు హరీష్​ రావు డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైక్రోబేవరేజెస్ కు  110 దరఖాస్తులు రాగా.. వాటిలో బీఆర్​ ఎస్ ప్రభుత్వ హయాంలోనే 25  దరఖాస్తులకు అనుమతిచ్చారు. సింగూరు జలాలను మైక్రోబేవరీకి కేటాయించిందే గతప్రభుత్వం..కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే విమర్శలు చేస్తున్నారని అన్నారు. నలుగురు మంత్రులు ఒకే కారులో రాజ్​ భవన్​ కు వస్తే దానిపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. 

►ALSO READ | ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది: మీనాక్షి నటరాజన్ 

తెలంగాణకోసం మంత్రి పదవికిరాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నాను..  రాష్ట్రం వచ్చినంక బీఆర్​ ఎస్​ నేతలు, హరీష్​ రావు వ్యవహారం, నిర్వాకం నచ్చకనే పార్టీని నుంచి బయటికి వచ్చానని మంత్రి జూపల్లి అన్నారు.  25ఏళ్లుగా నిజాయితీగా పనిచేస్తున్నాను.. మా ఊర్లో సొంత ఇళ్లు కూడా లేదు. నేను మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కటి అబద్దం అని నిరూపించినా నేను దేనికైనా సిద్దమని హరీష్​ రావుకు మంత్రి జూపల్లి సవాల్​ విసిరారు. 

అంతకుముందు మైక్రో బేవరేజెస్ పై మాట్లాడిన హరీష్​ రావురాష్ట్రంలో మరో అవినీతి కుంభకోణాన్ని బయటపెడుతున్నట్లు చెప్పారు. ఎక్సైజ్​ శాఖలో మైక్రో బేవరేజెస కు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. 110 దరఖాస్తుల్లో 25 కు అనుమతివ్వాలని నిర్ణయించారు.. కొత్త అనుమతుల్లో ముఖ్య నేత కోటా 21, మంత్రి కోటా 4 అని హరీష్​ రావు ఆరోపించారు.