నల్లగొండ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేస్తాం : ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి

నల్లగొండ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేస్తాం : ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి
  • ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి
  • 18 మందితో తొలి జాబితా విడుదల

నల్గొండ అర్బన్, వెలుగు:  నల్లగొండ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండలోని కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి బీఆర్‌ఎస్ కార్పొరేషన్ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. కాంగ్రెస్ పాలకులు గతంలో నల్లగొండ మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేయగా, బీఆర్‌ఎస్ పాలనలో పట్టణం సుందర నగరంగా మారిందని తెలిపారు. కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకుని రూ.1500 కోట్లతో ఐటీ హబ్, మెడికల్ కళాశాల, రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. 

కేటీఆర్ ప్రత్యేక చొరవతో వందల కోట్ల నిధులు తెచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ చొరవతోనే నల్లగొండకు కార్పొరేషన్ హోదా వచ్చిందని స్పష్టం చేశారు. నల్లగొండ అభివృద్ధికి బీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని, ఇప్పటివరకు తెచ్చిన నిధులపై రాష్ట్ర మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డివిజన్లకు చెందిన18 మందితో కూడిన బీఆర్‌‌ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించారు.