ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్.. టైం నైట్ 10.30.. నిద్రలోకి జారుకోకపోవడంతో దక్కిన ప్రాణాలు !

ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్.. టైం నైట్ 10.30.. నిద్రలోకి జారుకోకపోవడంతో దక్కిన ప్రాణాలు !

బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గ పరిధిలోని హోసనగర తాలూకా సుదూర్ దగ్గర మంగళవారం రాత్రి ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుంది. అదృష్టవశాత్తూ ఈ బస్సులోని 40 మందికి పైగా ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. మంగళవారం రాత్రి 1‌‌0.30 గంటల సమయంలో సుదూర్ ప్రాంతానికి దగ్గరలో బస్సు వెళుతుండగా డ్రైవర్ క్యాబిన్ నుంచి పొగ రావడాన్ని డ్రైవర్తో పాటు, ప్రయాణికులు కూడా గమనించారు.

డ్రైవర్ కంగారు పడి బస్సును ఆపేసే ప్రయత్నంలో చెట్టును ఢీ కొట్టాడు. ప్రయాణికులు మెలకువతో ఉండటంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ తో పాటు, కిటీకీల అద్దాలు బద్దలు కొట్టుకుని బస్సులో నుంచి బయటకు దూకేశారు. నిమిషాల వ్యవధిలోనే బస్సు మంటల్లో తగలబడిపోయింది. డ్రైవర్, కండక్టర్తో పాటు మరో వ్యక్తి స్వల్పంగా కాలిన గాయాలతో బయటపడ్డారు.