గురువారం రోజున ఆల్ టైం లైఫ్ హైకి చేరిన బంగారం, వెండి రేట్లు ఎట్టకేలకు శుక్రవారం కొంత తగ్గుదలను చూశాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటమే ఈ తగ్గింపుకు మెయిన్ కారణంగా నిపుణులు అంటున్నారు. మరో రెండు రోజుల్లో బడ్జెట్ కూడా ఉండటంతో దిగుమతి సుంకాలపై పెరుగుతున్న ఆందోళనలు, రిటైలర్ల నుంచి భారీ డిమాండ్ రేట్లను ముందుకు తీసుకెళ్తున్నాయని తేలింది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న వారు తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో రేట్లను ముందుగా గమనించాలి.
జనవరి 30న బంగారం రేట్లు కొద్దిగా తగ్గాయి. దీంతో జనవరి 29 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.823 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా తగ్గి రూ.17వేల 062గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.15వేల 640గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : ఈసారి జీడీపీ వృద్ధి 7.4 శాతం..
ఇక వెండి రేటు చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ శుక్రవారం కొంత తగ్గింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. జనవరి 30, 2025న వెండి రేటు కేజీకి రూ.15వేలు తగ్గింది దేశంలో. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.10వేలు తగ్గి రూ.4లక్షల 15వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.415 వద్ద ఉంది.
