చాలా రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు కొద్దిగా పెరుగుదలను నమోదు చేశాయి. గడచిన 15 రోజులుగా యుద్ధం ప్రభావంతో పెద్దగా మార్పులు లేకుండా మెల్లమెల్లగా తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్ తిరిగి పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రిటైలర్లు తమ నగరాల్లోని నేటి రేట్లను తెలుసుకుని ముందుకెళ్లటం మంచిది.
మార్చి 17న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. మార్చి 16 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.120 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 862గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 540గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : ఇరాన్ మైండ్ గేమ్
మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మార్చి 17, 2026న దేశవ్యాప్తంగా రూ.5వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.4వేలు పెరిగి రూ.2లక్షల 80వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.280 వద్ద ఉంది.
