జగిత్యాల జిల్లాలో ఘోరం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ కాస్తా తెల్లారేసరికి హత్యకు దారి తీసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కోరుట్ల మండలం మాదాపూర్ కి చెందిన హరిబాబు, వైష్ణవి ఏడాది క్రితం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి ఇంట్లో పెళ్లి ఇష్టంలేకపోవడంతో.. అమ్మాయి తల్లిదండ్రులు తమ ఊర్లోనే ఉండేందుకు ఒప్పుకున్నారు. అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో ఏం జరిగిందో ఏమో కానీ... సోమవారం ( మార్చి 17 ) రాత్రి వైష్ణవి, హరిబాబు మధ్య గొడవ జరిగింది. తెల్లారేసరికి వైష్ణవి అచేతనంగా పడి ఉంది.
రాత్రి వైష్ణవితో గొడవపడిన హరిబాబు తెల్లవారేసరికి చంపేసి పరారయ్యాడని చెబుతున్నారు బంధువులు. హరిబాబు వైష్ణవిని చంపేసి పరారయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
పరారీలో ఉన్న హరిబాబు కోసం గాలిస్తున్నారు పోలీసులు. వైష్ణవిని హత్య చేసిన హరిబాబును కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు కుటుంబసభ్యులు.
