పదేళ్లు మీరేం చేశారు.?..దాసోజుకు మంత్రి పొన్నం కౌంటర్

పదేళ్లు మీరేం చేశారు.?..దాసోజుకు మంత్రి పొన్నం కౌంటర్

మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ శ్రవణ్ మధ్య మాటల యుద్ధం సాగింది. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడిన శ్రవణ్..   తెలంగాణ తల్లి నుండి బతుకమ్మను తొలగించారని ఫైర్ అయ్యారు.  తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా కేసీఆర్ రూపొందించారని చెప్పారు.  సీఎం రేవంత్   తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల మీద రుద్దుతున్నారని అన్నారు. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పోటీగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి ఓటు వేయించుకొని రెండేళ్లు దాటిందిన్నారు.  

►ALSO READ | తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లని బుక్ చేస్తే... స్పీకర్లు, టంబ్లర్లు పార్సిల్ పంపిస్తున్నరు

 గత పదేళ్లు  పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరులకు ,తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేసిందో ముందు  చెప్పాలని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాము తెలంగాణ ఉద్యమకారులకు సముచిత న్యాయం చేస్తామని చెప్పారు.  పదేండ్లు  అధికారంలో ఉండి తెలంగాణ గీతాన్ని , తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు పొన్నం.  ఇదే మా తెలంగాణ తల్లి విగ్రహం అని చట్టం ఎందుకు చేయలేదన్నారు.  అందరినీ సంప్రదించిన తర్వాత తెలంగాణ తల్లి రూపాన్ని గ్రామీణ ప్రాంత మహిళను ప్రతి బింబించేలా ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సెక్రటేరియట్ గుండెల్లో పెట్టుకున్నామన్నారు.. పేద ప్రజలు కులాలకు అతీతంగా ఆడుకుని జరుపుకునే బతుకమ్మ బీఆర్ఎస్ పేటెంట్ లాగ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.  తెలంగాణ తల్లి విగ్రహాం గురించి ఎవరైన కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే   చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు పొన్నం.