Rasha Thadani: ‘RX 100’ డైరెక్టర్ మూవీలో కొత్త హీరోయిన్.. ‘మంగ’గా మెస్మరైజ్ చేస్తోన్న 20 ఏళ్ల బ్యూటీ!

Rasha Thadani: ‘RX 100’ డైరెక్టర్ మూవీలో కొత్త హీరోయిన్.. ‘మంగ’గా మెస్మరైజ్ చేస్తోన్న 20 ఏళ్ల బ్యూటీ!

'RX 100' ఫేమ్ అజయ్ భూపతి-ఘట్టమనేని జయకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ రాషా థడానీ హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. 

లేటెస్ట్గా రాషా థడానీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు అజయ్ భూపతి విడుదల చేశారు. ఈ చిత్రంలో రాషా ‘మంగ’ అనే కీలక పాత్రలో కనిపించనుందని ఆయన వెల్లడించారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

2005లో పుట్టిన రాషా థడానీ, ఇప్పటికే బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ నటించిన 'అజాద్'లో కీలక పాత్రలో కనిపించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుండటంతో, ఆమె నటనపై సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా, ఘట్టమనేని వారసుడు జయకృష్ణ, రవీనా టాండన్ కూతురు రాషా టాండానీ కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి రికార్డును సృష్టిస్తుందో అనే ఇంపాక్ట్ సైతం ఉంది. 

అజయ్ భూపతి మార్క్: 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' వంటి సంచలనాత్మక చిత్రాలతో అజయ్ శైలి చూశారు తెలుగు ఆడియన్స్. ఇప్పుడు మరింత ప్రెస్టీజియస్గా తీసుకుని 'శ్రీనివాస మంగాపురం' తెరకెక్కిస్తున్నాడు. దానికి తోడు ఒకే సినిమాలో ఇద్దరు సినీ వారసులను పరిచయం చేసే బాధ్యతను అజయ్ తీసుకుని తెలుగు, హిందీ పరిశ్రమల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.

అజయ్ భూపతి ఎంచుకునే కథలు, పాత్రలు ఎంత వినూత్నంగా ఉంటాయో 'ఆర్ఎక్స్ 100'లో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లను పరిచయం చేసిన తీరుతో మనకు తెలుసు. ఈసారి కూడా జయకృష్ణ, రషాలను రూరల్ ఎమోషనల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకునే కంటెంట్తో వస్తున్నట్లు సినీ వర్గాల టాక్. 

భారీ బ్యానర్ల అండదండలు..

ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న ఈ వారసుడి తొలి చిత్రాన్ని, టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతి మూవీస్ బ్యానర్‌పై లెజెండరీ నిర్మాత అశ్విని దత్ సమర్పిస్తున్నారు. 'చందమామ కథలు' బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ భారీ కలయికే సినిమా స్థాయిని తెలియజేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.