ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నిందితుల రిమాండ్ ను పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ధనుంజయ, వెంకటెష్, కృష్ణమోహన్ కు ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన నిందితులు కూడా బెయిల్ కోసం పిటిషన్ వేశారు. శుక్రవారం ( జనవరి 30 ) ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఈమేరకు తీర్పు వెల్లడించింది.
లిక్కర్ కేసులో నిందితులకు రిమాండ్ గడువు ఫిబ్రవరి 13 వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. ఈ క్రమంలో నిందితులకు ఏసీబీ కోర్టులో నిరాశే ఎదురైనట్లు అయ్యింది. నిందితులు రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. గురువారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.
బెయిల్ మంజూరైన ముగ్గురు నిందితులకు షరతులు విధించింది కోర్టు. నిందితుల పాస్ పోర్టులను మేజిస్ట్రేట్ ఎదుట సమర్పించాలని, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. బ్యాంకు అకౌంట్లకుక్ సంబంధించి కూడా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
