Dhurandhar OTT Release: ఓటీటీలోకి రణ్‌వీర్ సింగ్ 'దురంధర్'.. అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Dhurandhar OTT Release: ఓటీటీలోకి రణ్‌వీర్ సింగ్ 'దురంధర్'.. అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'దురంధర్'.  గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.  2025 ఏడాదికి గానూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది. విక్కీ కౌశల్ 'ఛావా', రిషబ్ శెట్టి 'కాంతార-2' వంటి భారీ చిత్రాలను సైతం వెనక్కి నెట్టింది. ఏకంగా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఈ మూవీ చరిత్ర సృష్టించింది.

స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా 'దురంధర్' నిలిచింది.  థియేటర్లలో రికార్డుల వేట ముగించుకున్న ఈ మూవీ.. ఇప్పుడు డిజిటల్ తెరపై రచ్చ చేసేందుకు సిద్ధమైంది. 'దురంధర్' ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చేసింది.  జనవరి 30 నుంచి ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం జనవరి 30, 2026 అర్ధరాత్రి 12 గంటల నుండి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

రన్‌టైమ్ షాక్.. ఫ్యాన్స్‌కు నిరాశ!

సాధారణంగా సినిమాలకు ఓటీటీలో 'అన్‌కట్ వెర్షన్' వస్తుందని ఆశిస్తారు. కానీ 'దురంధర్' విషయంలో సీన్ రివర్స్ అయింది. థియేటర్లలో ఈ సినిమా నిడివి 3 గంటల 34 నిమిషాలు కాగా, నెట్‌ఫ్లిక్స్‌లో దీనిని 9 నిమిషాలు తగ్గించి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ రన్‌టైమ్ తగ్గింపు కొంత నిరాశ కలిగించే విషయమే.  థియేటర్లలో విడుదలైన 54 రోజుల తర్వాత ఈ స్పై థ్రిల్లర్ డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమా  కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి వస్తోంది. 

కథా నేపథ్యం

దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని ఒక పక్కా ఇంటెలిజెన్స్ స్పై డ్రామాగా మలిచారు. రణ్‌వీర్ సింగ్ హంజా అనే క్లిష్టమైన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో విశ్వరూపం చూపించారు.  అక్షయ్ ఖన్నా  మెయిన్ విలన్ -గా  రెహమాన్ డకైత్ పాత్రలో నటించారు., ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి దిగ్గజాలు కీలక పాత్రల్లో నటించి సినిమా స్థాయిని పెంచారు.

పార్ట్-2 లోడింగ్!

మొదటి భాగం సాధించిన అసాధారణ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, మేకర్స్ ఇప్పటికే 'దురంధర్ 2'ను అధికారికంగా ప్రకటించారు. ఈ సీక్వెల్ జనవరి 19, 2027న థియేటర్లలోకి రానుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్ల నుండి రూ. 1000 కోట్ల వరకు వసూలు చేసిన ఈ ఫ్రాంచైజీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మరోసారి ఈ యాక్షన్ అడ్వెంచర్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారు నెట్‌ఫ్లిక్స్ లో చూడోచ్చు. మరి ఈ భారీ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!..