ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. జనవరి 30న విచారణకు హాజరుకాలేనని సిట్ అధికారులకు లేఖ రాశారు . విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలని సిట్ బృందాన్ని కోరారు.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ లకు సంబంధించిన గడువు ముగుస్తుండడంతో ఎన్నికల తర్వాత విచారించాలని కోరారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు మరొక తేదీని ప్రకటించాలని లేఖలో తెలిపారు కేసీఆర్.
తన అడ్రస్ ఫామ్ హౌస్ కు మారింది కాబట్టి..ఫామ్ హౌస్ లోనే విచారించాలని సిట్ ను కోరారు కేసీఆర్. బాధ్యత గల పౌరుడిగా సిట్ విచారణకు సహకరిస్తానని చెప్పారు. ఇకపై ఎలాంటి నోటీసులైనా ఎర్రవల్లి ఫామ్ హౌస్ అడ్రస్ కే పంపించాలని కోరారు.
జనవరి 30న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని ఇవాళ ఉదయం కేసీఆర్ కు సిట్ నోటీసులిచ్చింది. కేసీఆర్ ఎక్కడ విచారణ కోరుకుంటే అక్కడే విచారిస్తామని సిట్ తెలిపింది. ఈ క్రమంలో సిట్ నోటీసులకు కేసీఆర్ లేఖ రాశారు.
